విమానంలో కొత్తిమీర : పెరిగిన డిమాండ్

నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకూ పెరుగి పోతున్నాయి. తాజాగా రాష్ట్రాల్లో ఉల్లి ధరలు పెరిగిన విషయం అందరికీ తెలిసిందే.

Update: 2019-11-07 03:00 GMT

నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకూ పెరుగి పోతున్నాయి. తాజాగా రాష్ట్రాల్లో ఉల్లి ధరలు పెరిగిన విషయం అందరికీ తెలిసిందే. అది మరవక ముందే ఇప్పడు మరో నిత్యావసర వస్తువు ధర కూడా పెరిగిపోయింది. ఇంక ఈ విధంగా ధరలు పెరిగిపోతుంటే మధ్య తరగతి కుటుంబాల పరిస్తితి అగమ్య గోచరంగా మారాల్సిందే. వర్షాభావ పరిస్థితుల వలన తాజాగా మార్కెట్ లో మిర్చి ధరకూడా పెరిగిపోతుంది. ఇప్పడు మిర్చిని తింటే కాదు, కొంటేనే ఘాటు తగులుతుంది. అంతే కాక దానిపోపాటు కొత్తిమీర ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పటివరకూ ఎప్పడూ లేని విధంగా తేజా రకం మిర్చి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో కోల్డ్‌ స్టోరేజీల్లో భద్రపరచిన మిర్చి ధక బుధవారం క్వింటాలకు రూ.18,100 పలికింది. జూలై మాసంలో రూ.11వేలు ఉన్న మిర్చి ధర ఇప్పడు ఏకంగా రూ.18వేలకు పెరిగిందంటే అర్థం చేసుకోండి మిర్చి పంటకు మనదేశంలోనే కాక ఇతర విదేశాల్లో కూడా ఎంత డిమాండ్ ఉందో. పంటకు ఎంత డిమాండ్ ఉన్నప్పటికీ కర్ణాటక, మహారాష్ట్రల్లో కురుస్తున్న వర్షాల కారణంగా పంటలు బాగా దెబ్బతినడంతో రానున్న కాలంలో ధరలు ఇంకా పెరుగుతాయని మర్కెట్ విష్లేషకులు చెబుతున్నారు.

ఇక కొత్తిమీర విషయానికొస్తే కిలోకు రూ.150 పలుకుంది. ఈ పంట కూడా వర్షాలకు బాగా దెబ్బ తినడం వలన దీనికి కూడా మార్కెట్లో డిమాండ్ పెరిగిపోతుంది. ఈ పంటకు బుధవారం రాష్ట్రంలోని వరంగల్‌లో రూ.150 పలికింది. వర్షాలకు కొత్తిమీర పంట బాగా దెబ్బ తినడంతో బెంగళూరు, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి కూరగాయల వ్యాపారులు  దిగుమతి చేసుకుంటున్నారు. ఈ కొత్తిమీరను హైదరాబాద్‌కు ఇతర రాష్ట్రాలనుంచి విమానం ద్వారా తీసుకువచ్చి అక్కడనుంచి వరంగల్ కు సరఫరా చేసేలా వ్యాపారులు ఒప్పందం చేసుకున్నట్లు వరంగల్‌లోని కొంతమంది కూరగాయల వ్యాపారస్తులు చెబుతున్నారు.



Tags:    

Similar News