బోగస్‌ ధ్రువీకరణ పత్రాలతో కల్యాణలక్ష్మి

నిరుపేద ఆడ పిల్లల కుటుంబాలను ఆదుకోవాలనే సంకల్పంతో రాష్ట్రప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది.

Update: 2019-11-08 06:23 GMT

నిరుపేద ఆడ పిల్లల కుటుంబాలను ఆదుకోవాలనే సంకల్పంతో రాష్ట్రప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. కానీ ఇప్పుడీ పథకం కొంతమంది దళారుల వలన, మరికొంతమంది అధికారుల వలన దుర్వినియోగం అవుతుంది. బినామీ పేర్లతో లేని వారిని సృష్టించి వారి పేరు మీద  వచ్చిన చెక్కులను కొంత మంది దళారులు తీసుకుంటున్నారు.

ఇదే కోణంలో నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలంలోని సత్తన్‌పల్లిలో ఓ సంఘటన చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన వివరాళ్లోకెలితే సత్తన్‌పల్లి గ్రామంలోని దొమ్మటి రమ–వెంకటేశ్‌గౌడ్‌లకు ఇద్దరూ కొడుకులే ఉన్నారు. ఈ విషయం తెలిసిన కొంతమంది దళారులు వారికి శ్యామల అనే పేరు గల కూతురున్నట్టుగా సృష్టించారు.  అంతే  కాదు శ్యామల అనే అమ్మాయి, వెంకటేశ్ గౌడ్ అనే అబ్బాయికి పెళ్లి జరగనున్నట్టు నకిలీ పెళ్లి కార్డును కొట్టించారు. గతేడాది అంటే 2018 డిసెంబర్‌ 14న పెళ్లి జరిగినట్టుగా ధృవ పత్రాలను సృష్టించి కల్యాణలక్ష్మి డబ్బుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారి ప్లాన్ బాగానే ఫలించి దొమ్మటి రమ పేరుపై చెక్కు మంజూరైంది.

స్తానిక ఎమ్మెల్యే ఈ నెల 4న క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రమంలోనే రమ–వెంకటేశ్‌ల పేర్లను కూడా పిలిచారు. దీంతో అసలు తతంగం అంతా అక్కడున్న అధికారుల దృష్టికి వచ్చింది. అయితే ఈ విషయం గురించి తమకు ఏం తెలియదని రమ–వెంకటేశ్‌లు అంటున్నారు. ఇదే విషయంపై అధికారులను వివరణ కోరాగా వారు కూడా తమకేమీ సంబంధం లేదని, తహసీల్దార్‌ విజయారెడ్డి చనిపోయిన రోజున ఈ విషయం తమకు చేరిందన్నారు. ఏదైతే నేం నిరుపేద ఆడపిల్లలకు చెందవలసిన పథకం ఇలా దళారుల పాలవుతుంది. చెందాల్సిన వాళ్లకి ఈ పథకం చెందకుండా దుర్వినియోగం అవుతుంది.



Tags:    

Similar News