అప్పట్లో కేసీఆర్ కంటే వారిద్దరే ఎక్కువ కష్టపడ్డారు..

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మరోసారి టీఆర్‌ఎస్ పై మండిపడ్డారు. లక్ష ఓట్లతో ఓడిపోయిన వినోద్‌కి కేబినెట్ ర్యాంక్ పదవా? హ అంటూ తీవ్రస్ధాయిలో మండిపడ్డారు.

Update: 2019-09-01 10:44 GMT

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మరోసారి టీఆర్‌ఎస్ పై మండిపడ్డారు. లక్ష ఓట్లతో ఓడిపోయిన వినోద్‌కి కేబినెట్ ర్యాంక్ పదవా? హ అంటూ తీవ్రస్ధాయిలో మండిపడ్డారు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కంటే ఈటెల, హరీ‎శ్ రావే తెలంగాణ ఉద్యమంలో ఎక్కువ కష్టపడ్డారని ఎంపీ అరవింద్ పేర్కొన్నారు. ఆ నాటి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వారే టీఆర్‌ఎస్‌కు దూరమయ్యారని, టీఆర్‌ఎస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం అత్యంత దారుణంగా ఉందని ఆయన విమర్శించారు. కేసీఆరే టీఆర్ఎస్ ఓనర్ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పటమా? అని ఎద్దేవా చేశారు. దేశమంతటా ఎరువుల సరఫరా ఉందని, కానీ తెలంగాణలో ఈ విషయమై వ్యవసాయ మంత్రికి ఇప్పటి వరకు కొంచెం కూడా ధ్యాసలేదని అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. 

Tags:    

Similar News