లండన్ లో నిమ్స్ ప్రొఫెసర్ మీనాకుమారి మృతి

Update: 2020-01-18 09:58 GMT
డాక్డర్ మీనా కుమారి

ఎంతో పేరు ప్రఖ్యాతలను పొందిన నిమ్స్ సీనియర్ ఫిజీషియన్ డాక్డర్ మీనా కుమారి తుది శ్వాస విడిచారు. పూర్తివివరాల్లోకెళ్తే లండన్‌లో నిర్వహించిన అంతర్జాతీయ వైద్య సదస్సు హాజరయ్యారు. ఆ సదస్సులో ఉపన్యసిస్తున్న డాక్డర్ మీనా కుమారి గుండెపోటుతో ఒక్క సారిగా స్టేజీపైనే కుప్పకూలారు. దీంతో అక్కడున్న ప్రముఖులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అయినప్పటికీ ఆమె పరిస్థితి విషమించడంతో వైద్యులు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు.

ఈ విషాద సంఘటనపై యూకే డిప్యూటి హై కమిషనర్‌ డా.ఆండ్రూ ఫ్లెమింగ్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేసారు. అనంతరం ఆమె కుటుంబానికి, సన్నిహితులకు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. ఈ విషాదసంఘటన గురించి సమాచారం తెలుసుకున్న ఆమె కుటుంసభ్యులు, నిమ్స్‌ వైద్యులు, ఆసుపత్రి సిబ‍్బంది తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. కాగా తమిళనాడుకు చెందిన మీనాకుమారి గాంధీ ఆస్పత్రి నుంచి ఆమె ఎంబీబీఎస్, ఎండీ కోర్సులను పూర్తి చేశారు. నిమ్స్‌లో 25 ఏళ్లుగా సేవలందిస్తున్న మీనాకుమారి ప్రత్యేక గుర్తింపును సాధించారు. 



Tags:    

Similar News