మృతదేహాలను పరిశీలించినున్న ఎన్‌హెచ్‌ఆర్‌సీ బృందం

-ఎన్‌కౌంటర్ మృతులకు ఇవాళ అంత్యక్రియలు లేనట్లే -రేపు మహబూబ్‌నగర్‌కు NHRC ప్రతినిధుల బృందం

Update: 2019-12-06 15:31 GMT

దిశ హత్యచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దిశ అత్యాచార నిందితులన్ని కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలోషాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి వద్ద క్రైమ్‌ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా, నిందితులు పారిపోవడానికి ప్రయత్నం చేయడంతో నలుగురు నిందితులను పోలీసులు కాల్చి చంపారు.

నిందితుల ఎన్‌కౌంటర్ మృతులకు ఇవాళ అంత్యక్రియులు జరిగే అవకాశం లేదు. రేపు మహబూబ్‌నగర్‌కు NHRC ప్రతినిధుల బృందం రానుంది. మృతదేహాలను NHRC బృందం పరిశీలించిన తర్వాతే అంత్యక్రియలు జరగునున్నాయి. రేపు మధ్యాహ్నం తర్వాతే అంత్యక్రియలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే శనివారం మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి ఎన్‌హెచ్‌ఆర్‌సీ బృందం వెళ్లనుంది. ఎన్‌కౌంటర్‌ చెందిన మృతుల నిందితుల మృతదేహాలను పరిశీలింస్తారు. 

Tags:    

Similar News