నాయిని సంచలన వ్యాఖ్యలు..మంత్రి పదవి ఇస్తానని..

Update: 2019-09-09 08:56 GMT

అసెంబ్లీ లాబీలో మాజీ మంత్రి నాయిని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి ఇస్తానని కేసీఆర్ మాట తప్పారని అన్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటే వద్దని, కౌన్సిల్‌లో ఉండు మంత్రి పదవి ఇస్తానన్నారని నాయిని తెలిపారు. తన అల్లుడికి కూడా ఎమ్మెల్సీ ఇస్తానన్నారని చెప్పారు నాయిని. తనకు ఆర్టీసీ చైర్మన్ పదవి వద్దు అందులో రసం లేదన్నారు. కేసీఆర్ తమ ఇంటికి పెద్ద తామంతా ఓనర్లమే అన్న నాయిని కిరాయిదార్లు ఎంత కాలం ఉంటారో వాళ్ళ ఇష్టమని వ్యాఖ్యానించారు.

Full View

Tags:    

Similar News