మన్సురాబాద్‌ కాలనీ వాసులు ప్రగతి భవన్‌ ముట్టడి

పేదప్రజలకు అందించాల్సిన డబుల్ బెడ్ రూం ఇండ్లు తమకు కేటాయించడం లేదంటూ కొంతమంది ప్రజలు వాపోతున్నారు.

Update: 2019-12-10 09:12 GMT

పేదప్రజలకు అందించాల్సిన డబుల్ బెడ్ రూం ఇండ్లు తమకు కేటాయించడం లేదంటూ కొంతమంది ప్రజలు వాపోతున్నారు. స్థానికంగా ఉండే నాయకులు వారికి ఇండ్లు కేటాయించకుండా అడ్డొస్తున్నారని వాపోతున్నారు.

ఇదే నేపద్యంలో హైదరాబాద్ లోని మన్సురాబాద్ కాలనీకి చెందిన కొంత మంది ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెండు పడక గదుల ఇళ్లను తమకు కేటాయించకుండా కొంత మంది నాయకులు అడ్డుకుంటున్నారన్నారు. ఎలాగయినా తమ గోడును సీఎంకు చెప్పుకోవాలని కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ ముట్టడికి సిద్ధపడ్డారు.

దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకోవడానికి యత్నించడంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించి అక్కడి నివసిస్తున్న 150 కుటుంబాలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ ఒక్క ప్రాంతంలోనే కాకుండా ప్రతి చోటీ ఇదే పరిస్థితి నెలకొని ఉందని స్థానికులు తెలుపుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పేద ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు.   

Tags:    

Similar News