తల్లిని వేధించిన కొడుకు: మల్కాజ్‌గిరి కోర్టు సంచలన తీర్పు

Update: 2019-07-22 13:56 GMT

మల్కాజ్‌గిరి కోర్టు సంచలన తీర్పునిచ్చింది. తల్లిని వేధించిన కొడుకుకి జైలు శిక్ష విధించింది. నేర్మెట్‌లో నివశిస్తున్న 70 ఏళ్ల వృద్ధురాలు ప్రేమ కుమారికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె. 2013లో ఆమె భర్త చనిపోయాడు. అప్పటికే పిల్లలకి వివాహాలు జరిగాయి. అయితే ఎవరికి వారు వేరువేరు కాపురాలు పెట్టడంతో పెద్ద కుమారుడి నుంచి తల్లికి వేధింపులు మొదలయ్యాయి. తల్లిని ఇంట్లోకి రానివ్వకుండా కొడుకు, భార్య బలవంతంగా బయటికి గెంటేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని క్రూరంగా హింసించడం మొదలుపెట్టారు. దీంతో బాధిత తల్లి 2015లో పోలీసులను ఆశ్రయించింది. నాలుగేళ్ల పాటు కోర్టులో నడిచిన ఈ కేసులో ఈ రోజు తీర్పువచ్చింది. పెద్దకుమారుడు అమిత్‌తో పాటు, అతని భార్య షోబిత లావణ్యకు రెండేళ్ల జైలు శిక్ష, 20వేల జరిమానా విధించింది కోర్టు. 

Tags:    

Similar News