కుక్కలకు భయపడి చెట్టెక్కిన చిరుత

సాధారణంగా అడవిలో ఉండే పులులు, సింహాలు, చిరుతపులులను చూసి మిగతా జంతువులు భయపడతాయి.

Update: 2020-05-04 07:37 GMT
Leopard Climbs Tree in Kamareddy

సాధారణంగా అడవిలో ఉండే పులులు, సింహాలు, చిరుతపులులను చూసి మిగతా జంతువులు భయపడతాయి. కానీ ఓ చిరుతపులి అడవి కుక్కలు వెంబడించడంతో తన ప్రాణాలను రక్షించుకోవడానికి చెట్టెక్కి కూర్చుంది. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పోతాయిపల్లి అడవీ ప్రాంతంలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. పూర్తివివరాల్లోకెళితే పోతాయిపల్లి, నందివాడ శివారులో దట్టమైన అటవీ ప్రాంతంలో కొన్ని వేట కుక్కులు ఆదివారం మధ్యాహ్నం ఓ చిరుత పులిని వెంబడించి దాడి చేయడానికి ప్రయత్నించాయి. దీంతో చిరుతపుటి తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఓ చెట్టుపైకెక్కడి కూర్చోడంతో కుక్కలు అరవడం మొదలు పెట్టాయి.

అది గమనించిన కొంత మంది గొర్రెల కాపరులు కుక్కలను ఆ ప్రాంతం నుంచి తరిమికొట్టిన తరువాత చెట్టుపై చేరుకున్న చిరుత దిగి అడవిలోకి వెళ్లింది. ఆ తరువాత పశువుల కాపరులు అటవీ అధికారులకు సమాచారం అందించగా అక్కడికి చేరుకుని అధికారులు గ్రామాన్ని సందర్శించి చిరుత సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం ఆ ప్రాంత వాసులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పోతాయిపల్లి, కోమట్‌పల్లి, నందివాడ, కేశాయిపేట తదితర గ్రామాలకు చెందిన పశువుల కాపరులు, తునికాకు సేకరణ కోసం వెళ్లే మహిళలు అప్రమత్తంగా ఉండాలని చంద్రకాంత్‌రెడ్డి సూచించారు.

Tags:    

Similar News