పట్టణపగ్రతిని అమలు చేస్తాం : మంత్రి కేటీఆర్

Update: 2020-01-03 03:04 GMT
కేటీఆర్

పల్లె ప్రగతే తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు, పల్లెలు ఎల్లకప్పుడూ పచ్చాగా ఉండాలన్నాదే తన ధ్యేయమని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.గరువారం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం మోహినికుంటలో రెండో విడత పల్లె ప్రగతి ప్రణాళికను మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమం లాగానే మున్సిపల్‌ ఎన్నికల తర్వాత రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో పట్టణ ప్రగతి ప్రణాళికను అమలు చేస్తామన్నారు. మున్సిపల్‌ పాలక వర్గాలకు శిక్షణ ఇచ్చి, పకడ్బందీగా పట్టణ ప్రగతిని అమలు చేస్తామన్నారు.

గతేడాది అమలు చేసిన పల్లో ప్రగతి కార్యక్రమంలో రాష్ట్రంలోని 12,751 గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. అదే కోణంలో ఇప్పుడు రెండో విడతను అమలు చేస్తున్నామన్నారు. ఈ పల్లె ప్రగతి కార్యక్రమం ప్రారంభించడానికి ముందు కేటీఆర్ తాత సోంతూరైన మోహినికుంటలో పర్యటించి 'పల్లె ప్రగతి'ని పరిశీలించారు. అనంతనంతరం సొంత ఊరిని చూస్తుంటే తాత నాయనమ్మలు గుర్తొస్తున్నారన్నారు. ఆ గ్రామంలో స్థలం ఇస్తే తాత, నాయనమ్మల పేరిట సొంత ఖర్చులతో ఫంక్షన్‌ హాలు నిర్మిస్తామని కేటీఆర్‌ ప్రకటించారు. ఆ గ్రామం కోసం ఏదైనా మంచి పని చేయాలని కేసీఆర్ సూచించారని కేటీఆర్ తెలిపారు.

ఇదిలా ఉంటే 'మంత్రి కేటీఆర్‌ సమర్థవంతుడని, ఆయనకి ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కేటీఆర్‌ నాయకత్వంలో నిర్వహించిన అన్ని ఎన్నికల్లో విజయం పార్టీ ఘన విజయం సాధించిందన్నారు.




Tags:    

Similar News