హాస్టల్ విద్యార్దులకు కేటీఆర్ భరోసా...

కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో రవాణా వ్యవస్త ఎక్కడి కక్కడ స్థంబించిపోయింది.

Update: 2020-03-25 15:22 GMT
KTR (File Photo)

కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో రవాణా వ్యవస్త ఎక్కడి కక్కడ స్థంబించిపోయింది. సరిగ్గా ఇదే సమయానికి హైదరాబాద్ నగరంలోని కొన్ని హాస్టల్ల నిర్వహకులు హాస్టల్లలో ఉండే విద్యార్థులను వెంటనే ఖాలీ చేసి వెల్లిపోవాలని, బలవంతంగా ఖాలీ చేయిస్తున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎటూ దిక్కుతోచని విద్యార్థులు వందల సంఖ్యలో ఆయా ప్రాంతాల్లోని పోలీస్‌ స్టేషన్లను ఆశ్రయిస్తున్నారు. అంతే కాక తమ సమస్యలను కేటీఆర్ కు విన్నవిస్తూ విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై స్పందించిన తెలంగాణ మంత్రి కేటీఆర్ నగరంలోని హాస్టల్స్‌ నుంచి ఎవరిని ఖాళీ చేయించొద్దని నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు. ఉన్న పలంగా విద్యార్థులను ఖాలీ చేపిస్తే ఎక్కడి వెలతారని ప్రశ్నిస్తున్నారు.

మంత్రి తన ట్విటర్ అకౌంట్ లో విద్యార్థులకు ఖాళీ చేయించొద్దు అంటూ ట్వీట్ చేసారు. హాస్టల్లకు కావలసిన అన్ని సౌకర్యాలు అందేలా ఇప్పటికే ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. సౌకర్యాలు కల్పించాలని నగర మేయర్‌కు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు, హైదరాబాద్‌, సైబరాబాద్‌ పోలీసులకు చెప్పామని స్పష్టం చేసారు. హాస్టల్ నిర్వహకులకు ఎలాంటి సమస్యలు రానివ్వమని ఆయన హామీ ఇచ్చారు. వసతి గృహాల్లో ఇబ్బందులను గురించి తెలుసుకోవడానికి గాను నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌, నగర ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు అధికారులతో కలిసి వసతి గృహాలను సందర్శించాలని తెలిపారు. ఎప్పటి కప్పుడు పరిస్థితి పర్యవేక్షించాలని కోరారు.



Tags:    

Similar News