రామ్ గోపాల్ వర్మ ట్వీట్ కు ఫన్నీ పంచ్ వేసిన మంత్రి కేటీఆర్!

Update: 2020-04-11 02:23 GMT
KTR funny answer to RGV on Twitter (represntational image..source: KTR and RGV twitter)

రామగోపాల్ వర్మ ఈ పేరు వింటే సినిమాల కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ఎప్పుడూ ఎదో ఒక విషయం పై వ్యంగ్యంగా స్పందించడం అయన అలవాటు. ఆఖరుకు తన సినిమాల్ని కూడా సోషల్ మీడియా వేదికగానే ఎక్కువగా ప్రచారం కానించేస్తుంటారు వర్మ.

ఇక మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా ఏక్టివ్ గా ఉంటారు. తన దృష్టికి సోషల్ మీడియా ద్వారా వచ్చిన ప్రతి సమస్య పైనా నేరుగా స్పందించి ఆ సమస్యకు పరిష్కారం వెంటనే దొరికేలా చేస్తూ ప్రజలతో నిత్యం టచ్ లో ఉంటారు కేటీఅర్. అయన ట్విట్టర్ లో చాలా నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తారు.

ఇప్పడు ఇవన్నే ఎందుకంటే.. వ్యంగ్యంగా స్పందించే రాంగోపాల్ వర్మకు.. నిర్మాణాత్మకంగా వ్యవహరించే మంత్రి కేటీఅర్ కూ మధ్య నేరుగా ట్విట్టర్ వేదికగా మాట్లాడుకునే అవకాశం వస్తే ఎలా ఉంటుందో చెప్పే సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.

మంత్రి కేతీఅర్ శుక్రవారం రాత్రి 8 గంటలకు ట్విట్టర్ వేదికగా తనతో నేరుగా మాట్లాడమని నెటిజన్లను ఆహ్వానించారు. #AskKTR పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారీ స్పందన వచ్చింది. అయితే, అనూహ్యంగా ఈ కార్యక్రమానికి మొదటి ప్రశ్న వర్మ నుంచి వచ్చింది. వర్మ అంటేనే విచిత్ర సమస్యలను నెత్తికెత్తుకునే రకం కదా.. అదే చేశారు అయన. లాక్ డౌన్ తో మదయం దొరక్క మెలికలు తిరిగిపోతున్న మందుబాబుల సమస్యలను మంత్రి కేటీఆర్ కు చెప్పుకొచ్చారు అయన. అంతేనా ఎక్కడో పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ చేస్తున్నట్టు చేయొచ్చు కదా అంటూ ప్రశ్నించారు.

రామ్ గోపాల్ వర్మ #AskKTR కు సంధించిన ప్రశ్న ఇదీ..

''మీకు నాదో విన్నపం. ఎవరైతే బోర్‌గా ఫీలవుతూ జుట్టు పీక్కుంటున్నారో, చిన్నపిల్లల్లాగా ఏడుస్తున్నారో, మెంటల్ ఆస్పత్రుల్లో చేరుతున్నారో, ఫ్రస్టేషన్‌తో భార్యలను కొడుతున్నారో వీరి కోసం మమతా బెనర్జీ లాంటి పెద్ద మనస్సు ఉండాలి. అలాంటి పద్ధతినే ఇక్కడ కూడా ప్రవేశపెట్టండి'' అని వర్మ ట్వీట్ చేశారు.

దానికి మంత్రి కేటీఆర్ కూడా అంతే స్పీడుగా మతిపోయే సమాధానం ఇచ్చారు.

'రామూ గారూ.. హెయిర్‌ కట్‌ గురించే అడుగుతున్నారు కదా' అంటూ చమత్కరించారు. ఆలోచిస్తున్న ఓ ఇమోజీని కూడా జత చేశారు.

ఇది నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. ఇక ఇదే కార్యక్రమంలో పలువురు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ తాడిన శైలిలో సమాధానం ఇవ్వడమే కాకుండా పలు విషయాలపై తన అభిప్రాయాలను స్పష్టం చేశారు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ తో కేటీఅర్ సంభాషణ తో పాటు పలు ట్వీట్ లు మీకోసం..









Tags:    

Similar News