పరోక్షంగా దిశ నిందితుల ఎన్ కౌంటర్ సమర్ధించిన సీఎం కేసీఆర్

Update: 2020-01-02 15:27 GMT
కేసీఆర్

సమాజంలో నేర ప్రవృత్తి పెరగకుండా నైతిక విలువలు పెంపొందించే విధంగా విద్యా విధానం ఉండాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. దురదృష్టవశాత్తూ సమాజంలో నేరప్రవృత్తి పెరుగుతుందని కొన్ని చోట్ల మనషులు మృగాల్లా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ డీజీపీ హెచ్‌జె దొర ఆటోబయోగ్రఫీ జర్నీ థ్రూ టర్బులెంట్‌ టైమ్స్‌ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్ నేరప్రవృత్తి ప్రబలకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో కొన్ని పనులు ఇష్టం లేకున్నా చేయాల్సి వస్తుందన్నారు. మంచిని కాపాడడం కోసం కఠినంగా వ్యవహరించడం తప్పు కాదని పరోక్షంగా దిశ నిందితుల ఎన్ కౌంటర్ ను సమర్ధించారు సీఎం కేసీఆర్.

విలువలు పెంపొందించే పాఠ్యాంశాల తయారీ కోసం మాజీ డీజీపీలతో కమిటీ ఏర్పాటు చేస్తామని జీయ్యర్ స్వామి లాంటి ఆధ్యాత్మిక,ధార్మిక వేత్తల సలహాలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ చెప్పారు. తెలంగాణాను ఆదర్శవంతమైన సమాజంగా తీర్చిదిద్దటానికి పోలీసులు తమ విలువైన భాగస్వామ్యం అందించాలని పిలుపునిచ్చారు. పోలీసులు శాంతి భద్రతల పర్యవేక్షణకే పరిమితం కాకుండా పోలీసులు సామాజిక బాధ్యతతో అనేక కర్తవ్యాలు నిర్వర్తిస్తున్నారని చెప్పుకొచ్చారు.  

Tags:    

Similar News