ఆడపిల్లలకు రక్షణ ఏదీ..కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి

ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా నడిచినప్పుడే దేశానికి స్వాతంత్రం వచ్చినట్లు అని అన్నారు కొంతమంది పెద్దలు.

Update: 2019-11-30 10:40 GMT
కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి

ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా నడిచినప్పుడే దేశానికి స్వాతంత్రం వచ్చినట్లు అని అన్నారు కొంతమంది పెద్దలు. కానీ ఇప్పటి కాలంలో ఆడపిల్ల అర్ధరాత్రి కాదు పట్టపగలు కూడా ఒంటరిగా రోడ్డుపైన నడవలేని దుస్థితి ఉంది. రోజు రోజుకూ ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఆడ పిల్లలు నెలల పసికందుగా ఉన్నప్పటినుంచే వారికి రక్షణ లేకుండా పోతుంది. మూడు నెలల క్రితం వరంగల్ నెలల పసికందుపై ఒక కామాంధుడు అఘాయిత్యం చేసి ఆ చిట్టి తల్లి పసిప్రాయాన్ని చిదిమేసాడు.

మొన్నటికి మొన్న అదే వరంగల్ లో నమ్మిన స్నేహితుడే తనపై అఘాయిత్యం చేసి అమ్మాయిని చంపేసాడు. ఆ సంఘటనలు బమరవకముందే నలుగురు కామాంధులు ప్రియాంక రెడ్డిని చంపేసారు. ఇవి మాత్రమే కాదు ప్రతి రాష్ట్రంలోనూ ఇలాంటి సంఘటనలు చాలా చోటు చేసుకుంటున్నాయి. ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నా, ఎంత మంది పోలీసులు ఉన్నా, ఎన్ని చట్టాలు వచ్చినా మహిళల పట్ల జరిగే అఘాయిత్యాలు, నేరాలు మాత్రం ఆగడం లేదు. ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులు తమ పిల్లలు బయటికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆందోళనకు గురివుతున్నారు.

ఇదిలా ఉంటే ప్రియాంక రెడ్డి సంఘటన జరిగిన తరువాత ఈ విషాద ఘటనపై ప్రతి ఒక్క నాయకులు స్పందిస్తున్నారు. ఇదే కోణంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కూడా స్పందించారు.

ఈ నేపద్యంలోనే శనివారం ఆయన మీడియాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రియాంక రెడ్డి హత్య కేసు తర్వాత తెలంగాణలో ఆడపిల్లల తల్లిదండ్రులు భయపడి పోతున్నారని, వారికి రక్షణ లేదా అన్నారు. ప్రతి ఆడపిల్ల తన కాళ్లమీద తాను స్వశక్తిగా ఉండానుంటుందని కానీ ప్రస్తుతం జరుగుతున్న అఘాయిత్యాలను చూస్తుంటే ఆడపిల్లలను బయటికి పంపించడానికే భయం వేస్తుందన్నారు.

ఆడపిల్లలు బయటికెళితే ఇంటికొచ్చేంత వరకు వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతూనే ఉన్నారన్నారు. ఇలాంటి ఘటనలు మ‌ళ్లీ పుణరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. మహిళల కోసం ఐపీఎస్ అధికారితో వెంటనే ఒక కంట్రోల్ రూమ్‌ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటువంటి సంఘటనలు చోటుచేసుకున్నప్పుడు ముఖ్యమంత్రి స్పందించి బాధిత కుటుంబాలను పరామర్శించాని కోరారు. ప్రియాంక రెడ్డి హత్య ఘటనపై తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ, పశుసంవర్థక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు విచిత్రంగా ఉన్నాయని జానారెడ్డి వారిని విమర్శించారు.



Tags:    

Similar News