IT Raids: హైదరాబాద్ నగరంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో 8చోట్ల తనిఖీలను చేపట్టారు. జూబ్లీహిల్స్,బంజారాహిల్స్ లోని ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇళ్లు, కార్యాలయాల్లో ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. పలు పత్రాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రధానంగా సంక్రాంతికి రిలీజ్ అయిన భారీ బడ్జెట్ సినిమాలే లక్ష్యంగా ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. వందల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన సినిమాల్లో భారీగా పన్ను ఎగవేతలు ఉన్నాయని ఐటీ శాఖ అనుమానిస్తోంది. ఒక్కో సినిమాను వందల కోట్లతో నిర్మించినట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఐటీ శాఖ ఏకకాలంలో రైడ్స్ చేపట్టింది.
దిల్ రాజుకు లక్ష్యంగా ఈ సోదాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సంక్రాంతికి రిలీజ్ అయిన చిత్రాల్లో భారీగా బడ్జెట్ చిత్రాలపై ప్రధానంగా ఐటీ శాఖ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. సినీ నిర్మాతలు, వారి సమీప బంధువుల ఇళ్లలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.