Revanth Reddy: నేను చేరలేని దూరం కాదు... దొరకనంత దుర్గం కాదు.. సామాన్యుడి మనిషిని నేను..
Revanth Reddy: గత సీఎం మాదిరిగా కాకుండా... ప్రజలకు అందుబాటులో ఉంటానన్న రేవంత్
Revanth Reddy: నేను చేరలేని దూరం కాదు... దొరకనంత దుర్గం కాదు.. సామాన్యుడి మనిషిని నేను..
Revanth Reddy: గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మాదిరి కాకుండా తాను సామాన్య జనానికి సైతం అందుబాటులో ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్‌లో పోస్టు చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులను ఆయన నేరుగా కలుసుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో సందర్శకులను కలుసుకుని వారి సమస్యలను వినడంతో పాటు సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. రెవెన్యూ ఉద్యోగి దయాకర్ 317 జీవో కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను తెలియజేయగా.. లోకసభ ఎన్నికల నియమావళి ముగియగానే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా సీఎం తన ఎక్స్ ఖాతాలో ఆసక్తికర పోస్టు చేశారు. నేను చేరలేని దూరం కాదు... దొరకనంత దుర్గం కాదు... సామాన్యుడి మనిషిని నేను... సకల జనహితుడను నేను... అని పేర్కొన్నారు. తాను ముఖ్యమంత్రి అయినా సామాన్య జనంతో కలిసిపోయే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తినని చెప్పుకొచ్చారు.