ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు: జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌

జనాభాపెరుతున్న కొద్ది నగరంలో ట్రాఫిక్ సమస్యలు పెరిగిపోతున్నాయి. ఈ కారణంగా ప్రయాణికులు ఎంతగానో ఇబ్బందులు పడుతున్నాయి.

Update: 2020-02-16 07:28 GMT

జనాభాపెరుతున్న కొద్ది నగరంలో ట్రాఫిక్ సమస్యలు పెరిగిపోతున్నాయి. ఈ కారణంగా ప్రయాణికులు ఎంతగానో ఇబ్బందులు పడుతున్నాయి. ఇక ఈ విషయాన్ని సుమోటోగా తీసుకన్న జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈనేపథ్యంలోనే జీహెచ్‌ఎంసీలో సిటీ కన్జర్వెన్స్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ ట్రాఫిక్ నియంత్రణ చేయడానికి సంబంధిత శాఖలు వెంటనే తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.

జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు మార్గాన్ని జీహెచ్‌ఎంసీకి అప్పగించాలని అధికారులకు తెలిపారు. మెట్రో అధికారులు పార్కింగ్‌ స్థలాలను గుర్తించి నోటిఫై చేయాలన్నారు. అదే విధంగా ఫుట్‌పాత్‌ల పునరుద్ధరణ పనులు, హెచ్‌ఎంఆర్‌ మార్గాల్లో రోడ్లు, సెంట్రల్‌ మీడియన్ల అభివృద్ధి పనులు పూర్తిచేయాలని తెలిపారు. సిటీలో ఉన్న చీకటి ప్రాంతాల్లో ఈ నెల 29వ తేదీ వరకు విద్యుత్‌దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. వాటర్‌లాగింగ్‌ సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. భూగర్భ పైప్‌లైన్ల లీకేజీలకు వెంటనే మరమ్మతులు చేయాలని జలమండలి అధికారులను కోరారు.

ఇందులో భాగంగానే ప్రమాదాల నివారణకు 40 కి.మీ.ల వేగపరిమితి సూచికలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. రోడ్లు తవ్వడానికి ముందూ యుటిలిటీస్‌ మ్యాపింగ్‌ తీసుకొని చర్యలు చేపట్టాలని తెలిపారు. దానికి సంబంధించిన ప్రతిపాదనలు సీఆర్‌ఎంపీ ఏజెన్సీలకు అందజేయాలన్నారు. అదే విధంగా విద్యుత్‌ స్తంభాల తరలింపు ప్రక్రియనే త్వరగా పూర్తిచేయాలని చెప్పారు. ఈ సమావేశానికి హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ శ్వేతామహంతి, జీహెచ్‌ఎంసీ అడిషనల్, జోనల్‌ కమిషనర్లు, విభాగాధిపతులు పాల్గొన్నారు.


Tags:    

Similar News