"సై"రా సైదిరెడ్డి

సైదిరెడ్డి ఈ పేరు వింటే చాలు 2018 ఎన్నికల్లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కు గట్టి పోటీ పోటి ఇచ్చాడు.

Update: 2019-10-24 11:00 GMT

సైదిరెడ్డి ఈ పేరు వింటే చాలు 2018 ఎన్నికల్లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కు గట్టి పోటీ ఇచ్చి ఓడించినంత పను చేసిన వ్యక్తిగా అందరికీ గుర్తుకొస్తారాయన. విజయాన్ని చేజిక్కించుకోక పోయినప్పటికీ నియోజకవర్గంలో ప్రజలకు, టీఆర్ఎస్ శ్రేణులకు అందుబాటులోనే వున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాదించడానికి తనవంతు కృషిని అందించారు. ఇప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట లాంటి హుజూర్‌నగర్‌లో గులాబీ జెండాను ఎగరేసారు.

అసలెవరీ సైదిరెడ్డి..

సైదిరెడ్డి 1974, ఏప్రిల్‌ 18వ తేదీన సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుండ్లపల్లిలో అంకిరెడ్డి, సత్యవతి రెడ్డి దంపతులకు జన్మించారు. పదో తరగతి వరకు మఠంపల్లి మండలంలోని వీవీ హైస్కూల్‌లో చదువుకున్నారు. ఇంటర్‌ హుజుర్‌నగర్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో, డిగ్రీ ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో అభ్యసించారు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన సైదిరెడ్డికి తను చదువుకునే రోజుల నుంచి తను రాజకీయాలంటే ఆసక్తి చూపించేవారు. దీంతో తన కాలేజి రోజుల్లో మాధవరెడ్డి, వేనెపల్లి చందర్ రావు సహకారంతో టీడీపీలో చేరారు. 2002, అక్టోబర్‌ 25వ తేదీన రజిత రెడ్డితో సైదిరెడ్డికి వివాహమైంది. వీళ్ళకి ఇద్దరు కుమారులు అంకిరెడ్డి(16), అనిరుధ్‌ రెడ్డి(13).

హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున నిలబడి విజయం కేతనం ఎగురవేశారు. దీంతో రాజకీయవర్గాల్లో అందరూ ఆయన గురించే చర్చించుకుంటున్నారు. స్థానిక ఎన్నికల్లో మాజీమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చిన సైదిరెడ్డి ఇప్పుడు ఆయన సతీమణి పద్మావతిని ఓడించాడు. తనకి ఎంతో ఇష్టమైన ఎమ్మెల్యే పదవిని దక్కించుకున్నాడు.

అనంతరం2005 సంవత్సరంలో కెనడాలోని వాంకోవర్కుకు వెళ్లి ప్రపంచ ప్రముఖ ఐటి కంపెనీలో ఉద్యోగం సాధించారు. కొన్ని రోజుల తరువాత కేసీఆర్ స్పూర్తితో జరిగిన తెలంగాణ ఉద్యమం పట్ల ఆకర్షితులై జగదీష్ రెడ్డి నాయకత్వంలో టీఆర్ఎస్‌లో చేరారు. అనంతరం సీఎం కేసీఆర్ సూచనలతో హుజూర్ నగర్ నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి 2018 ఎన్నికల్లో హుజూర్ నగర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అప్పుడు ఎన్నికల్లో ఉత్తమ్ కు గట్టి పోటీ ఇచ్చి చివరి దశలో ఓడిపోయాడు.

ఇప్పుడు హుజుర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో తనకు వచ్చిన అవకాశాన్ని సైదిరెడ్డి సద్వినియోగం చేసుకోని భారీ మెజార్టీతో ఉత్తమ్‌ పద్మావతిరెడ్డిపై గెలుపొందారు.

Tags:    

Similar News