మున్సిపల్‌ ఎన్నికల పోరు..లిక్కరు అమ్మకాల జోరు..

అటు సంక్రాంతి పండుగ, ఇటు ఎన్నికల పండుగ మద్యం దుకాణాలని లాభాల్లో నడిపిస్తున్నాయనే చెప్పుకోవాలి.

Update: 2020-01-18 09:42 GMT

అటు సంక్రాంతి పండుగ, ఇటు ఎన్నికల పండుగ మద్యం దుకాణాలని లాభాల్లో నడిపిస్తున్నాయనే చెప్పుకోవాలి.సాధారణంగా సంక్రాంతి పండుగ సమయంలో లిక్కర్‌ అమ్మకాలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. కానీ ఈ సారి ఇదే సమయంలో మున్సిపాలిటీ ఎన్నికల ఉండడంతో పండగకి ముందు రోజు, పండగ తరువాత రోజుతో కలుపుకుని మొత్తం రూ.26.10కోట్ల విలువైన బీరు, లిక్కర్‌ అమ్మకాలు జరిగాయి. దీంతో అర్థమవుతుంది ఎన్నికల ప్రభావం మద్యం అమ్మకాల మీద ఎంతగా ఉందో.

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో అభ్యర్థులు ఓటర్లకు మద్యాన్ని పావులాగా వాడుకుంటున్నారు. పోలింగ్ సమయానికి మద్యం దొరకదేమో అన్న సందేహంతో ముందస్తుగానే మద్యాన్ని స్టాక్ చేసి పెట్టు్కుంటున్నారు. ఇకపోతే ఈ నెల 13, 14తేదీల్లో ఎన్నికల నామినేషన్ల ఉపహసంహరణ సందర్భంగా అమ్మకాలు ఒక్క సారిగా పెరిగాయని మద్యం విక్రయ దారులు తెలిపారు. ఆ తర్వాత 16తేదీన కూడా అమ్మకాలు జోరందుకున్నాయని తెలిపారు.

ఇక కొంత మంది నాయకులు ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్లకు డబ్బులు పంచడం పక్కన బెడితే, మద్యం బాటిళ్లను పంచే విధంగా పార్టీలు భారీ స్థాయిలో మద్యం పంచే విధంగా పక్క ప్రణాళికలను ఏర్పాటు చేసుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఈ ఎన్నికలతో మద్యం ప్రియులకు మాత్రం లాభం కలుగుతుందనే చెప్పుకోవాలి..  

Tags:    

Similar News