హైదరాబాద్ మెట్రో వినూత్న ప్రయత్నం : అది ఏంటో తెలుసా..?

హైదరాబాద్ నగరంలో మణిహారంగా ఉన్న మెట్రో ఎప్పటి కప్పుడు కొత్త ఆలోచనలను చేస్తూ వాటిని అమలుపరుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే మొన్నటికి మొన్న మెట్రో స్టేషన్ మెట్లపై ఎన్ని మెట్లు ఎక్కితే ఎన్ని క్యాలరీలు ఖర్చవుతాయని తెలిపే విధంగా క్యాలరీ డీటేల్స్ ని మెట్లపై రంగులు వేసి రాసారు.

Update: 2020-03-01 11:53 GMT

హైదరాబాద్ నగరంలో మణిహారంగా ఉన్న మెట్రో ఎప్పటి కప్పుడు కొత్త ఆలోచనలను చేస్తూ వాటిని అమలుపరుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే మొన్నటికి మొన్న మెట్రో స్టేషన్ మెట్లపై ఎన్ని మెట్లు ఎక్కితే ఎన్ని క్యాలరీలు ఖర్చవుతాయని తెలిపే విధంగా క్యాలరీ డీటేల్స్ ని మెట్లపై రంగులు వేసి రాసారు. దీంతో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు గాను మెట్లపై నుంచి నడవడం మొదలు పెడుతున్నారు. ఇప్పుడు ఇదే నేపథ్యంలో మరో వినూత్న ఆలోచనలను చేసింది మెట్రో.

హైదరాబాద్ నగర ఎన్నో ఏండ్ల చరిత్ర ప్రతి ఒక్క ప్రయాణికులకు తెలిసే విధంగా ప్రయత్నాలు చేస్తుంది. అంతే కాదు నగర భాష, సంస్కృతి, ఆచార వ్యవహారాలను నగరానికి కొత్తగా వచ్చే వారందరికి తెలియజేయాలనుకుంది. ఇందుకోసమే "పక్కా హైదరాబాదీ" పేరిట హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఆ సంస్థ మేనేజింగ్ డైరక్టర్, ఎన్.వి.యస్. రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ నేపథ్యంలోనే జంట నగరాలలో మాట్లాడే భాషలో ఎక్కువగా వినియోగించే పదాలైన"కైకూ, నక్కో, ఐసాయిచ్, ఖైరియత్?, పోరి, పరేషాన్" ఇలాంటి కొన్ని పదాల వెనక ఉన్న అర్థం ఎంటో, వాటిని ఏ సందర్భంలో వనియోగిస్తారో తెలియజేయనున్నారు. ఇందుకు గాను వాటి వాటి అర్థాలను మెట్రో స్టేషన్ గోడలపై రాయించాలని ప్రతిపాదించినట్లు ఎన్.వి.యస్. రెడ్డి తెలిపారు. అంతే కాక నగరంలో చూడదగ్గ ప్రదేశాలు, పర్యాటక ఆకర్షణలు, నేక దర్శనీయ స్థలాలు, దాంతో పాటుగానే ముఖ్యమైన రంగాలలో ఎన్నో సేవలందించిన ప్రముఖుల తైలవర్ణ చిత్రాల ప్రదర్శనను ఏర్పాటు చేయాలని తెలిపారు. వాటితో పాటుగానే దేశ విదేశాల వారిని కూడా ఆకర్షిస్తున్న 400 ఏండ్ల పైబడిన గొప్ప చరిత్రగల హైదరాబాద్ నగర సాంస్కృతిక కళా వైభవాన్ని పలువురికి తెలియజేయ్యాలనే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఈ ఉద్దేశ్యంతో ఈ ఏర్పాట్లు చేయాలని దానికి తగిన చర్యలు తీసుకుంటోందని ఆయన అన్నారు. ఈ విషయమై నగర పౌరుల్లో ఆసక్తి గలవారు తమ సలహాలను, సూచనలను cprohmrl@gmail.com కు ఈమెయిల్ చేయవచ్చని ఒక ప్రకటనలో కోరారు.



Tags:    

Similar News