ఒక కోడి.. 150 గుడ్లు..రూ.40వేల ఆదాయం

Update: 2019-07-19 03:58 GMT

నాగర్‌కర్నూలుకు చెందిన ఓ నాటుకోడి ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పటివరకు 150 గుడ్లు పెట్టిన కోడి యజమానికి రూ.40వేలకు పైగా ఆదాయం సమకూర్చింది. వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా ఇది నిజం. తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం దేవునితిర్మలాపూర్‌కు చెందిన రామకృష్ణాచారి నాటుకోళ్ల పెంపకాన్ని ఆదాయ వనరుగా మార్చుకున్నాడు. గతంలో అతడు పెంచుకున్న ఓ కోడికి పుట్టిన నాటుకోడి ప్రస్తుతం అతడికి వేలకు వేలు ఆదాయం ఇస్తోంది. ఈ కోడిని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎగబడుతున్నారు. అయితే మరికొందరు అయితే ఏకంగా గుడ్లను తీసుకెళ్లి తమ కోళ్లకు పొదుగేసుకున్నారు. ఇక ఈ విషయమై పశువైద్యాధికారిని అడిగారు. దికిని వైద్యాధికారి సమాధానం చెబుతూ జన్యులోపం వల్ల లక్షల్లో ఒక కోడి ఇలా గుడ్లు పెడుతుందని తెలిపారు. మొత్తానికి ఈకోడి వల్ల యాజమానికి కాసుల వర్షం కురిస్తుందనే చెప్పవచ్చు.

Tags:    

Similar News