తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన ఐఏండీ

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.అండమాన్, మాల్దీవుల్లోని సముద్రతీర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయని తెలిపింది.

Update: 2019-09-17 05:28 GMT

తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాల నుంచీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రెండు రోజులపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో సహా గోవా, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో యానాం, పుదుచ్చేరి వంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. అండమాన్, మాల్దీవుల్లోని సముద్రతీర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయని వెల్లడించింది. కాబట్టి మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని సూచించింది.  

Tags:    

Similar News