దేశీయ మైక్రోస్కోప్‌ల తయారీ పెరగాలి: గవర్నర్‌ తమిళిసై

హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ హెచ్‌ఐసీసీలో ఈరోజున నోవాటెల్‌ హోటల్‌లో 12వ ఆసియా మైక్రోస్కోపిక్‌ సదస్సు నిర్వహించారు.

Update: 2020-02-03 06:11 GMT

హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ హెచ్‌ఐసీసీలో ఈరోజున నోవాటెల్‌ హోటల్‌లో 12వ ఆసియా మైక్రోస్కోపిక్‌ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశీయంగా మైక్రోస్కోప్‌ల తయారీ విసృతంగా పెంచేవిధంగా కృషి చేయాలన్నారు. మనిషి అపోహలను, మూఢనమ్మకాలను మైక్రోస్కోప్‌ తుడిచిపెట్టిందని గవర్నర్‌ తెలిపారు. ప్రపంచం అభివృద్ది చెందడానికి మూలకారణం మైక్రోస్కోపేనని ఆమె అన్నారు. దీని ద్వారా ఎన్నో మంచి విషయాలను ప్రపంచంలో తెలిసిందని ఆమె అన్నారు.

ఈ సూక్ష్మదర్శిని ద్వారా కంటికి కనిపించని పరిమాణంలో ఉన్నఅతి చిన్న జీవుల్ని కూడా విజువలైజ్‌ చేసే పరిజ్ఞానం మైక్రోస్కోప్‌ల ద్వారా వచ్చిందని ఆమె వెల్లడించారు. ఈ నేపద్యంలోనే దేశీయంగా మైక్రోస్కోప్‌ల తయారీ పెరగాలని దాని ద్వారా ఎన్నో ఉపయోగాలున్నాయని తెలిపారు. సునిషిత పరిశీలన, పరిశోధనలకు మైక్రోస్కోప్‌లు ఎంతగానో దోహదపడతాయని గవర్నర్‌ తెలిపారు. కార్యక్రమంలో భారత సైంటిస్టులతో పాటు ఆసియా దేశాల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.


Tags:    

Similar News