ట్రాఫిక్ నియంత్రణకు కొత్త విధానం...

పట్టణాల్లో ఎక్కడ చూసినా ట్రాపిక్, ట్రాఫిక్. రోజు రోజుకు పెరిగిపోతున్న వాహణాల వల్ల పట్టణాల్లోనే కాదు, గ్రామల్లో కూడా ఎన్నో సమస్యలు. దీని ద్వారా ట్రాఫిక్ సమస్యలు మాత్రమే కాదు, పర్యావరణ కాలుష్యం, వాయు కాలుష్యం పెరిగిపోతున్నాయి.

Update: 2020-02-10 12:11 GMT

పట్టణాల్లో ఎక్కడ చూసినా ట్రాపిక్, ట్రాఫిక్. రోజు రోజుకు పెరిగిపోతున్న వాహణాల వల్ల పట్టణాల్లోనే కాదు, గ్రామల్లో కూడా ఎన్నో సమస్యలు. దీని ద్వారా ట్రాఫిక్ సమస్యలు మాత్రమే కాదు, పర్యావరణ కాలుష్యం, వాయు కాలుష్యం పెరిగిపోతున్నాయి. ఈ మహానగరంలో ఏర్పడే పద్మవ్యూహం లాంటి ట్రాఫిక్ నుంచి తప్పించుకుంటూ ప్రయాణాన్ని ముందుకు సాగించడంతో పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఇంత భారీగా ఉన్న ట్రాఫిక్ ను నియంత్రించడానికి పోలీసులు ఇప్పటివరకు ఎన్నో చర్యలు తీసుకున్నప్పటికీ అవి ఫలించలేదనే చెప్పుకోవాలి. అయినా ట్రాఫిక్ పోలీసులు, అధికారులు ట్రాఫిక్ సమస్యల నుంచి ప్రయాణికులకు బయట పడేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు.

కాగా ట్రాఫిక్ పోలీసులు నగరంలో ఎన్ని కార్లు ఉన్నాయి. అందులో ఎన్ని కార్లలో ఒక్కరు ఇద్దరు చొప్పున ప్రయాణం చేస్తున్నారు అన్న విషయాలను పరిగణలోకి తీసుకున్నారు. కాగా ఇప్పటి వరకూ తేల్చిన లెక్కల్లో నగరంలో 50 లక్షల కార్లు రోడ్లపై తిరుగుతున్నాయని అందులో 80 శాతం కార్లలో ఒక్కరు ఇద్దరు ప్రయాణిస్తున్నారని తేలింది. దీంతో పోలీసులు, జీహెచ్ఎంసీ, రవాణా శాఖ అధికారులు ఒక కొత్త ప్రణాళికకు తెరతీశారు. నగర పరిధిలో కారు పూలింగ్ విధానాన్ని అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

ఆ విధానాన్ని అమలు చేస్తే కొంతవరకు ట్రాఫిక్‌ను నిలువరించవచ్చని అంటున్నారు. ఇప్పటికే ఈ పద్ధతిని కొన్ని ప్రైవేటు సంస్థలు అమలు చేస్తున్నాయి. ఈ కార్ పూలింగ్ విధానం వల్ల పెట్రోల్, వ్యక్తిగతంగా డబ్బులు ఆదా కావుతాయని, ట్రాఫిక్ సమస్యలు కూడా తగ్గనున్నాయంటున్నారు. త్వరలోనే హైటెక్ సిటీ, తదితర ప్రాంతాల్లోని ఉద్యోగులతో మాట్లాడి ఈ విధానాన్ని అమలు పరిచేలా పోలీసు, జీహెచ్ఎంసీ, రవాణాశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Tags:    

Similar News