కరోనా అనుమానితులు ఉంటే రెడ్ నోటీస్..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్య కుప్పలుగా పెరిగిపోతున్నాయి.

Update: 2020-03-25 10:47 GMT
Coronavirus Red Notice

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్య కుప్పలుగా పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా, ఎవరి నోట విన్నా కరోనా కేసుల గురించే చర్చలు జరుగుతున్నాయి. భారత దేశంలో అందులోనూ తెలంగాణ రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రోజు రోజుకు కరోనా పాజిటిక్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ప్రజలు ఎవరూ 21రోజుల వరకు బయటికి రాకూడదంటూ ఆదేశించాయి. దేశ ప్రధాని ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది.

విదేశాల నుంచి వచ్చిన వారు, వస్తున్న వాళ్లు ఎట్టిపరిస్థితుల్లోనూ బయటికి రావొద్దని, వారంతా ప్రభుత్వం ఆదేశం ప్రకారం హోం క్వారంటైన్‌లో ఉండాలి సీఎం కేసీఆర్ తెలిపారు. ఎవరైతే హోం క్వారంటైన్‌లో ఉంటారో వారి ఇండ్లకు రెడ్ నోటిసులు పెట్టాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు క్వారంటైన్ లో ఉన్న వారి ఇండ్లకు కుటుంబసభ్యుల అనుమతితో 'ఈ ఇంటికి రాకూడదు' అని రాసి ఉన్న నోటీసులను అంటిస్తున్నారు. ఈ నోటీసు చూసిన వారంతా ముందు జాగ్రత్తతో వారి ఇండ్లకు వెల్లరని, అలా వైరస్ ను అదుపు చేయొచ్చని అధికారులు తెలిపారు.

ఇక పోతే ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చిన వారు చాలామంది తమ వివరాలను అధికారులకు తెలపకుండా గోప్యంగా ఉంచారు. వారిలో చాలా మంది ఇటలీ, ఇండోనేషియా, అమెరికా, దుబాయ్‌ నుంచి వచ్చినవారు ఉన్నారని తెలుస్తుంది. దీంతో వారందరినీ పరీక్షించడానికి రాష్ట్రంలో సుమారుగా 20 వేల వైద్య బృందాలు ఇంటింటికీ తిరిగి విదేశాల నుంచి వచ్చినవారికి కనుగొంటున్నారు. వారందరికీ క్వారంటైన్ ముద్రలు వేస్తున్నారు. వీరందరూ రాష్ట్రానికి 20 రోజులు ముందే చేరుకున్నారు. వారి వివరాలు గోప్యంగా ఉంచడంతో వారందరికీ పరీక్షలు నిర్వహించకపోవడంతో 14 రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు బయటపడుతున్నాయి. దీంతొ ప్రభుత్వం మరింత అప్రమత్తం అయింది.


Tags:    

Similar News