రాయడం-పాడటం-ఆడటం..నా వృత్తి : గద్దర్ ఉద్యోగ దరఖాస్తు

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలలో తనదైన శైలిలో పాటలు పాడి, అందరినీ అలరించిన గద్దర్ కొన్ని రోజులుగా సాంస్కృతిక కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు.

Update: 2019-12-04 07:32 GMT
ప్రజాగాయకుడు గద్దర్

 తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలలో తనదైన శైలిలో పాటలు పాడి, అందరినీ అలరించిన గద్దర్ కొన్ని రోజులుగా సాంస్కృతిక కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. అయితే ఇటీవల తెలంగాణ సాంస్కృతిక సారథిలో కళాకారులు కావాలన్న ప్రకటన చూసిన ప్రజాగాయకుడు గద్దర్

కళాకారుడి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. నియమకానికి నిర్ణీత నమూనాలో కాకుండా సొంత లెటర్‌ప్యాడ్‌పై తన బయోడేటాను రాసి ఉద్యోగం కోసం దరఖాస్తు అందించారు. ఈ దరఖాస్తును మంగళవారం గద్దర్, ఆయన అనుచరుడు యాదగిరి మాదాపూర్‌లోని తెలంగాణ సాంస్కృతిక సారథి కార్యాలయానికి వెళ్లి అందించారు. గద్దర్ కార్యాలయం బయట వేచి ఉండగా, యాదగిరి లోపలికి దరఖాస్తును సారథి కళాకారుల నియామక కమిటీ కార్యదర్శి బి.శివకుమార్‌కు అందించారు.

అయితే ప్రస్తుతం 73 ఏళ్ల వయస్సుగల గద్దర్ అందించిన దరఖాస్తులో ఈ విధంగా రాసి ఉంది.. నా పేరు గద్దర్‌. నేనొక గాయపడ్డ ప్రజల పాటను. చిన్నప్పటి నుండే ప్రజల పాటలను పాడుతున్నాను. రాయడం-పాడటం-ఆడటం..నా వృత్తి. నా వద్ద ప్రస్తుతం ఎలాంటి సర్టిఫికెట్లు లేవు. కళాకారునిగా నన్ను నియమించగలరు. వందనాలతో... గద్దర్‌ అంటూ రాసి తన దరఖాస్తును అందించారు.  

Tags:    

Similar News