చర్లపల్లిలో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్ చర్లపల్లి పారిశ్రామిక వాడ ఫేజ్ 2లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో స్ధానికంగా ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి.

Update: 2019-08-28 02:50 GMT

హైదరాబాద్ చర్లపల్లి పారిశ్రామిక వాడ ఫేజ్ 2లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో స్ధానికంగా ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. రసాయనాలు ఉన్న డమ్ములకు మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో పొగలు దట్టంగా అలుముకున్నాయి. విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన అగ్ని మాపక శాఖ సిబ్బంది రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపుచేశారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో పొగలు భారీగా వ్యాపించడంతో స్ధానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.   

Tags:    

Similar News