కరోనాపై దుష్ప్రచారం చేస్తే కేసులు పెట్టండి: మంత్రి ఈటల ట్వీట్

కరోనా దేశంలో చాపకింద నీరులా వ్యాపిస్తోంది. దేశంలో ఇప్పటికే ఈ వైరస్ కారణంగా ఇద్దరు మరణించారు. అధికారికంగా దేశంలో 100 కేసులు నమోదైయ్యాయి.

Update: 2020-03-16 12:20 GMT
Etela Rajender (File Photo)

కరోనా దేశంలో చాపకింద నీరులా వ్యాపిస్తోంది. దేశంలో ఇప్పటికే ఈ వైరస్ కారణంగా ఇద్దరు మరణించారు. అధికారికంగా దేశంలో 100 కేసులు నమోదైయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. తెలంగాణ సర్కార్ కూడా హై అలర్ట్ ప్రకటించించింది. రాష్ట్రంలోని అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. స్కూల్స్, సినిమా హాల్స్, మాల్స్ బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది. పోలీస్ శాఖ సైతం అప్రమత్తమైంది.

కరోనాకు సంబంధించిన వివిధ మెసేజ్‌లతో ఫోన్లలో నిండిపోతున్నాయి. కరోనాపై లేనిపోనివి తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అటు పోలీసులు, ఇటు నాయకులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు ఈ ప్రచారంపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పందించారు. కరోనా పాజిటివ్‌ అంటూ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసేవారిపై కేసులు పెట్టాలని పోలీసులను ఆదేశించామని మంత్రి ఈటల రాజేందర్‌ ట్వీట్‌ చేశారు. ఎవరూ కూడా సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేయవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు.

ఈ నేపథ్యంలోనే ముగ్గురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసారు. హైదరాబాద్‌ చైతన్యపురి పోలీసు స్టేషన్‌ పరిధిలోని కొత్తపేటకు చెందిన ముగ్గురు వ్యక్తులు కరోనా వైరస్‌ సోకిందని వాట్సాప్‌ గ్రూపుల్లో ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అందుకే వారిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నమని తెలిపారు. ఇంకెవరైనా ఇలాంటి ప్రచారాలు చేస్తే కారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.



Tags:    

Similar News