నడకతో గమ్యాన్ని చేరిన వలసకూలీలు...

లాక్ డౌన్ తో చాలా మంది వలస కూలీలు తమ సొంత గ్రామాలకు వెల్లేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. రవాణా వ్యవస్థ స్థంబించి పోవడంతో పది ఇరవై కిలో మీటర్లు కాదు ఏకంగా వందల కొలో మీటర్లు నడిచి వారి గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.

Update: 2020-03-29 12:07 GMT

లాక్ డౌన్ తో చాలా మంది వలస కూలీలు తమ సొంత గ్రామాలకు వెల్లేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. రవాణా వ్యవస్థ స్థంబించి పోవడంతో పది ఇరవై కిలో మీటర్లు కాదు ఏకంగా వందల కొలో మీటర్లు నడిచి వారి గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.పాత కాలంలో రవాణా వ్యవస్థ అమలులోకి రాక ముందు ఏ విధంగానైతే పూర్వీకులు వందల కిలో మీటర్లు నడుచుకుంటూ వెల్లే వారో ఇప్పుడు అచ్చం అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి.

మొన్నటికి మొన్న ఓ వృద్దుడు తన ఇంటికి చేరుకోవడానికి ఏకంగా 115 కిలో మీటర్లు నడిస్తే, కొంత మంది కూలీలు 250 కిలో మీటర్లు నడిచి గమ్యం చేరుకున్నారు. అంతే కాదు ఓ యువకుడు తన తల్లి మరణవార్త విని ఏకంగా 500పైచిలుకు కిలో మీటర్లు నడక ప్రయాణం చేయడానికి పూనుకుని 350 కిలో మీటర్లను 3 రోజుల్లో నడిచారు.

ఇప్పుడే ఇదే కోణంలో మరో పది మంది వ్యక్తులు కాలినడకన 100 కిలోమీటర్లు ప్రయాణించి స్వగ్రామానికి చేరుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం దొరతండాకు చెందిన పది మంది కర్ణాటకకు ఉపాధి కోసం వెళ్లారు. అక్కడే కష్టం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. కాగా కరోనావైరస్‌ వ్యాప్తి నివారణకు కేంద్రం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను విధించింది. దీంతో అక్కడ వ్యవస్థలన్నీ స్థంబించి పోయాయి. వలస కూలీలకు ఉపాధి లేకుండా పోయింది. దీంతో వారందరూ అక్కడ ఉండలేక స్వగ్రమానికి వెల్లాలనుకున్నారు. అయితే లాక్ డౌన్ వలన రవాణా వ్యవస్థ పూర్తిగా స్థింబించి పోవడంతో స్వగ్రామం చేరుకునేందుకు వారు నడకను ఆశ్రయించారు. అలా కర్ణాటకలోని చించోలి నుంచి 100 కిలో మీటర్లు నడకదారిగుండా స్వగ్రామం దొరితండాకు చేరుకున్నారు. అలా చేరకున్న వారిని అధికారులు గ్రమంలోకి వెల్లక ముందే వారికి ప్రభుత్వ పాఠశాలలో వైద్య పరీక్షలు నిర్వహించారు.

Tags:    

Similar News