అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూస్తా: సీపీ అంజనీ కుమార్‌

హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ లో ప్రతి ఏడాది ఎంతో సందడిగా ఎగ్జిబిషన్‌ ను నిర్వహిస్తారు.

Update: 2019-12-22 10:44 GMT
సీపీ అంజనీ కుమార్‌

హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ లో ప్రతి ఏడాది ఎంతో సందడిగా ఎగ్జిబిషన్‌ ను నిర్వహిస్తారు. ఈ ఎగ్జిబిషన్‌ దాదాపుగా 45 రోజుల పాటు కొనసాగుతుంది. ఎంతో ప్రఖ్యాతి గాంచిన ఈ ఎగ్జిబిషన్‌లో గతేడాది అపశృతి దొర్లింది. ఈ సంఘటనను దృష్టిలో పెట్టు్కుని ఈ ఉడాది ఎగ్జిబిషన్‌ సొసైటీ పలు జాగ్రత్తలు తీసుకుందని సీపీ అంజనీ కుమార్‌ తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ను హైకోర్టు ఆదేశాల మేరకు సీపీ పరిశీలించారు.

జనవరి 1న ఎగ్జిబిషన్‌ ప్రారంభమవుతుందన్నారు. దాదాపు 45 రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు. ఇందులో భాగంగానే 'కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు లభించే వస్తువులు అన్నీ ఇక్కడకు తీసుకొచ్చి విక్రయిస్తారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈనెల 25 నుంచి గ్రౌండ్‌లో బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రమాదాల నివారణకు ప్రతీ 30 మీటర్లకు ఫైర్‌ హైడ్రాన్ట్స్‌. 9 ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ మార్గాలు ఏర్పాటు చేశారని' సీపీ వివరించారు.

Tags:    

Similar News