తెలంగాణ ప్రభుత్వ కరోనా వాట్సాప్ చాట్‌బాట్‌..ఇతరులకు చెప్పండి!

రాష్ట్రంలో నుంచి కరోనా వైరస్ ను తరిమి కొట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది.

Update: 2020-04-06 15:02 GMT
KTR

రాష్ట్రంలో నుంచి కరోనా వైరస్ ను తరిమి కొట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా టెక్నాలజీని ఎంతగానో వాడుకుంటుంది. ఇందులో భాగంగానే మొన్నటికి మొన్ని ఆరోగ్య సేతు యాప్ ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రజలకు కరోనా వైరస్‌కు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం వాట్సప్ ఛాట్‌బాట్‌ను ప్రారంభించింది.

ఈ యాప్ ని తెలంగాణ ఐటీ శాఖ, వైద్య ఆరోగ్య శాఖలు, హైదరాబాద్ నగరానికి చెందిన సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ సంస్థ ఎస్‌బీ టెక్నాలజీస్, వాట్సాప్ అధికారిక వ్యాపార పరిష్కారాల భాగస్వామి మెసెంజర్ పీపుల్‌తో కలిసి సంయుక్తంగా రూపొందించారు. ఈ ఛాట్ బాట్ యాప్ ని తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ప్రజలు కరోనా వైరస్ గురించిన సమాచారం తెలుసుకోవానుకుంటే 9000658658 నెంబర్‌పై TS Gov Covid Info పేరుతో ఈ వాట్సప్ ఛాట్‌బాట్ ద్వారా తెలుసుకోవచ్చు.

అంతే కాదు కరోనా వైరస్ కు సంబంధించి ప్రజలకు ఏమైనా సందేహాలు ఉంటే దీని ద్వారా తెలుసుకోవచ్చును. ఈ యాప్ ఎలా ఉపయోగించాలంటే +919000658658 నెంబర్‌ను ముందు మొబైల్ లో సేవ్ చేసుకోవాలి. ఆ తరువాత వాట్సప్ ద్వారా Hi లేదా Hello లేదా Covid అని టైప్ చేసి https://wa.me/919000658658?text=Hi లింక్‌ను మీ స్మార్ట్‌ఫోన్ నుంచి క్లిక్ చేయాలి. అంతే వెంటనే మీకు కావలసిన సమాయారం వచ్చేస్తుంది. అంతే కాక ఈ యాప్ గురించి ఏమైనా సలహాలు ప్రభుత్వానికి చెప్పాలనుకుంటే covid19info-itc@telangana.gov.in మెయిల్ ఐడీకి ఇ-మెయిల్ చేయవచ్చు.



Tags:    

Similar News