తెలంగాణ సచివాలయంలో కరోనా కలకలం ?

తాత్కలిక తెలంగాణ సచివాలయంగా నడుస్తున్న బీఆర్కే భవన్‌లో ఒక్క సారిగా కరోనా కలకలం రేగింది.

Update: 2020-03-31 13:57 GMT
Representational Image

తాత్కలిక తెలంగాణ సచివాలయంగా నడుస్తున్న బీఆర్కే భవన్‌లో ఒక్క సారిగా కరోనా కలకలం రేగింది. పూర్తివిరాల్లోకెళితే ఈ మధ్య కాలంలో ఢిల్లీలో జరిగిన మత ప్రార్థనలకు రాష్ట్రం నుంచి ఎంతో మంది వెల్లి కరోనా బారిన పడి మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై ఢిల్లీలోని నిజాముద్దీన్‌కు రాష్ట్రం తరపున ఎంతమంది వెళ్లొచ్చారనే దానిపై దృష్టి పెట్టింది.

కాగా సచివాలయంలో పని చేస్తున్న ఓ ఉద్యోగి కూడా ప్రార్థనల్లో పాల్గొని వచ్చారనే ప్రచారం జరిగింది. నిన్నటివరకు ఆ ఉద్యోగి సచివాలయంలోనే విధులకు హాజరయ్యారని తెలిసింది. అంతే కాక ఐఏఎస్‌లతో పాటు ఇతర ఉద్యోగులు హాజరైన అన్ని మీటింగ్ లకు ఆ ఉద్యోగి హాజరయ్యారనే వార్తలు వచ్చాయి. దీంతో సచివాలయం ఉద్యోగులు ఒక్క సారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ సమాచారం అందుకున్న అధికారులు సచివాలయ ఉద్యోగులను మధ్యాహ్నమే ఇండ్లకు పంపించారని తెలుస్తోంది. అనంతరం సచివాలయ కార్యక్రమాలు నిర్వహిస్తున్న బీఆర్కే భవన్‌ని శానిటైజ్ చేసే కార్యక్రమం చేపట్టారు.

Tags:    

Similar News