అప్పటి వరకు ఇచ్చిన పాసు పుస్తకాలకే రైతు బంధు...నూతన మార్గదర్శకాలు విడుదల..

తెలంగాణ రైతుల్లో కొత్తగా రైతుబంధు పథకం ద్వారా లబ్ది పొందే అర్హత కేవలం ఈ ఏడాది జనవరి 23లోగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన వారికే ఉందని వ్యవసాయ శాఖ ప్రకటించింది.

Update: 2020-06-17 06:50 GMT

తెలంగాణ రైతుల్లో కొత్తగా రైతుబంధు పథకం ద్వారా లబ్ది పొందే అర్హత కేవలం ఈ ఏడాది జనవరి 23లోగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన వారికే ఉందని వ్యవసాయ శాఖ ప్రకటించింది. జనవరి 23వ తేది దాటిన తరువాత పాసుపుస్తకాలు పొందిన వారికి ఈ ఏడాది రైతుబంధుపథకం వర్తించదని స్పష్టం చేసింది. ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం మంగళవారం రైతుబంధు పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలతో కూడిన జీవోనువిడుదల చేసింది. కొత్తగా అమలులోకి వచ్చిన జీవో ప్రకారం రైతుబంధు నగదు ముందుగా తక్కువ భూమి ఉన్న వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు.

రైతుబంధు అవసరం లేదని భావించి రైతులు తమ భూమి ఉన్న ప్రాంతంలోని వ్యవసాయ అధికారికి గివ్ ఇట్ అప్ అప్లికేషన్ ఫాం నింపి అందించాలి. దీంతో అధికారులు వెంటనే వారి ఖాతానుంచి ఆ మొత్తాన్ని 'రైతుబంధు సమితి' అకౌంట్‌కు మళ్లిస్తారు. అంతే కాదు భూములు విక్రయించిన రైతుల పేర్లను అర్హుల జాబితా నుంచి కూడా తొలగిస్తారు. కొత్తగా పట్టాదార్ పాసుబుక్‌లను పొందిన వారికి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రైతుబంధును వర్తింపజేస్తారు. ఆర్వోఎఫ్ఆర్ పట్టాదారులకు సైతం రైతు బంధు సహాయం అందిస్తున్నారు. రైతుబంధు కోసం ఏడాదిలో ఒకేసారి వివరాలు పరిగణనలోకి తీసుకొంటామని ప్రభుత్వం తెలిపింది.


Tags:    

Similar News