హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్వేర్ కుటుంబంలో విషాదం
హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్వేర్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అమెరికా వీసా కోసం బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చింది ఈ సాప్ట్వేర్ ఫ్యామిలీ.
హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్వేర్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అమెరికా వీసా కోసం బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చింది ఈ సాప్ట్వేర్ ఫ్యామిలీ. బేగంపేట్‌లోని ఓ హోటల్ సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం బలైంది. కలుషిత ఆహారం వడ్డించడంతో రవినారాయణ కుమారుడు విహాన్ మృతి చెందాడు. హోటల్ నిర్లక్ష్యం కారణంగానే తమ కుమారుడు చనిపోయాడని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు.. హోటల్లోని ఫుడ్ శాంపిల్స్‌ను సేకరించారు. వాటిని పరీక్షల నిమిత్తం అధికారులు ల్యాబ్‌కు పంపారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.