కరీంనగర్ లో ఘోర ప్రమాదం: మానేరు వంతెనపై నుంచి కింద పడిన కారు

అతి వేగంవలన ఎన్నో రోడ్డు ప్రమాదాలు సంభవించి ఎంతో మంది తమ ప్రాణాలకు కోల్పోతున్నారు. ఇదే నేపథ్యంలో కరీంనగర్‌ పరిధిలోని అల్గునూరు వద్ద ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

Update: 2020-02-16 06:53 GMT

అతి వేగంవలన ఎన్నో రోడ్డు ప్రమాదాలు సంభవించి ఎంతో మంది తమ ప్రాణాలకు కోల్పోతున్నారు. ఇదే నేపథ్యంలో కరీంనగర్‌ పరిధిలోని అల్గునూరు వద్ద ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కరీంనగర్‌- హైదరాబాద్‌ హైవే మీద ఉన్న మానేరు డ్యాం వంతెన పై నుంచి ఓ కారు అదుపుతప్పి కాలువలో పడిపోయింది. దీంతో స్థానికులు వెంటనే కాలువలోకి దిగి వాహనాన్ని లేపి అందులో ఉన్నవారిని రక్షించే ప్రయత్నం చేసారు. కాగా ఈ వాహనం కరీంనగర్ నుంచి వరంగల్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనతో హైదరాబాద్‌-కరీంనగర్‌ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఈ వాహనంలో కరీంనగర్‌లోని సుభాష్‌నగర్‌ కు చెందిన గండి శ్రీనివాస్‌ (40), అతని భార్య ప్రయాణిస్తుండగా అందులో శ్రీనివాస్ అక్కడిడక్కడే మృతిచెందారు. అతని భార్య తీవ్రగాయాల పాలయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం సహాయక చర్యలు చేపట్టారు. ఈ సమయంలోనే బ్రిడ్జ్‌పై నుంచి శంకర్ అనే కానిస్టేబుల్ కారును పరిశీలిస్తుండగా ప్రమాదవశాత్తు అతను కూడా కాలువలో పడిపోయాడు. ఆ ప్రాతంలో నీళ్లు లేకపోవడంతో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో స్థానికులు ఆయనను వైద్యం కోసం హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం అయనను పరిశీలించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉన్నట్టు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


Full View


Tags:    

Similar News