Telangana: బుకింగ్ రద్దు చేస్తే రూ.500 జరిమానా : ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్

Update: 2019-12-31 07:01 GMT

నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి ఇంకా కొద్ది గంటలు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ పలు సూచనలను తెలిపారు. డిసెంబర్ 31 రాత్రి రోడ్లపై ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుందని వారు తెలిపారు. మద్యం మత్తులో వాహనాలను నడపకూడదని, మైనర్లు ఎట్టి పరిస్థితిలోనూ వాహనాలను నడపకూడదని పోలీసులు తెలిపారు. రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా డిసెంబరు 31న రాత్రి 11 నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకు ఫ్లైఓవర్‌లు, ఓఆర్‌ఆర్‌లను మూసివేస్తున్నట్టు తెలిపారు. ముఖ్యంగా సైబర్‌ టవర్స్‌, గచ్చిబౌలీ, బయో డైవర్సిటీ, మైండ్‌ స్పేస్‌ ఫ్లైఓవర్‌లపై వాహనాలకు అనుమతి లేదని ట్రాఫిక్‌ డీసీపీ ఎస్‌ఎం విజయ్‌కుమార్‌ ఈ సందర్భంగా స్పష్టం చేసారు.

ఇక ఎవరైనా ప్రయాణికులు ఓఆర్‌ఆర్‌పై విమానాశ్రయానికి వెళ్లాలనుకునేవారు వారికి సంబంధించిన ధృవపత్రాలను చూపించాలని వారు తెలిపారు. అంతే కాక అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా క్యాబ్ కాని, ఆటో కాని బుక్ చేసుకుంటే బుకింగ్ ని రద్దు చేయకూడదని డ్రైవర్లకు తెలిపారు. ఒక వేల ఎవరైనా బుకింగ్ ను రద్దు చేస్తే డ్రైవర్‌ పై సెక్షన్‌ 178 కింద రూ.500 చలాన్‌ విధిస్తామని తెలిపారు. నూతన సంవత్సర వేడులకలలో ఎలాంటి విషాదఛాయలు లేకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. పార్టీల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ వెంట్ ఆర్గనైజర్లకు తెలిపారు.



Tags:    

Similar News