అక్బరుద్దీన్ పై భజరంగ్ దళ్ ఫిర్యాదు

Update: 2019-07-26 02:42 GMT

హైదరాబాద్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ పై భజరంగ్ దళ్, హిందూ వాహని కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. కరీంనగర్ సభలో అక్బరుద్దీన్ చేసిన వాఖ్యలు హిందూ సంఘాల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆరోపించారు. మత విద్వేశాలు రెచ్చగొడుతున్న అక్బరుద్దీన్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలు హిందువులపై దాడులకు ముస్లింలు పురిగొల్పడమేనంటూ చైతన్యపురి పోలీసు ఠాణాలో బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు యశ్‌పాల్‌గౌడ్‌ ఫిర్యాదు చేశారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇట మహబూబ్ నగర్ రెండవ పట్టణ పోలీసు ఠాణాలో కూడా పలు హిందూ సంఘం నాయకులు ఫిర్యాదుల చేశారు.

కాగాఎంఐఎంనేత అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఫైరయ్యారు. 15 ఏళ్ల సమయం ఇచ్చినా అక్బరుద్దీన్ ఏమీ చేయలేరని గుర్తు చేశారు. ఇలాంటి రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే ప్రజలే గట్టిగా బుద్ధి చెబుతారని అన్నారు. మజ్లి్‌సతో స్నేహం చేసి సీఎం కేసీఆర్‌ పాముకు పాలు పోసి పెంచుతున్నారని దుయ్యబట్టారు. హిందూ-ముస్లింల మధ్య అక్బరుద్దీన్‌ చిచ్చుపెడుతున్నారంటూ వీహెచ్‌పీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పేను దూమరాన్ని రేపుతున్నాయి. 

Tags:    

Similar News