ఆపిల్‌ పండ్ల బుట్ట, మొక్కను సీఎంకు అందించిన రైతు బాలాజీ

Update: 2020-06-02 09:13 GMT

తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి యాపిల్‌ పంట పండించిన కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కెరిమెరి మండలం దనోరాకు చెందిన రైతు కేంద్రే బాలాజీ మంగళవారం సీఎం కే చంద్రశేఖర్‌ రావును కలిశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తాను పండించిన తొలి పంటను సీఎం కేసీఆర్‌కు అందించారు. ఈ సందర్భంగా రైతు బాలాజీని సీఎం అభినందించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రికి మొక్కను, ఆపిల్‌ పండ్లను అందించి శుభాకాంక్షలు తెలిపారు. ధనోరా గ్రామంలో 2 ఎకరాల్లో హెచ్ఆర్ 99 ఆపిల్ పంటను సాగుచేసినట్లు బాలాజీ తెలిపారు. ఈ తెలంగాణ ఆపిల్‌ పండ్లు మరికొద్ది రోజుల్లో మార్కెట్‌ల్లో అందుబాటులోకి రానున్నాయి. 

Tags:    

Similar News