కాలుష్య నివారణ కోసం కోర్టులో అప్పీల్

నగరాల్లో శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం ఎప్పటి కప్పుడు పెరిగిపోతుంది. ఇటీవల ఢీల్లీ లో పెరిగిన వాయు కాలుష్యానికి అక్కడి ప్రభుత్వం సరి, బేసి పద్ధతిని ప్రవేశపెట్టింది.

Update: 2019-11-11 10:00 GMT

నగరాల్లో శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం ఎప్పటి కప్పుడు పెరిగిపోతుంది. ఇటీవల ఢీల్లీ లో పెరిగిన వాయు కాలుష్యానికి అక్కడి ప్రభుత్వం సరి, బేసి పద్ధతిని ప్రవేశపెట్టింది. ఢీల్లీ తరువాత కాలుష్యంలో ముందంజలో ఉన్న నగరం హైదరాబాద్. నగరంలో పెద్ద ఎత్తున వాహనాల నడవడంతో వాటి నుంచి వెలువడే పొగ, శబ్దం వలన కాలుష్యం మరింత పెరిగిపోతుంది.

దీంతో పట్టణాల్లోని ప్రజలకు, ముఖ్యంగా గర్భిణులు, పసిపిల్లలు, వృద్ధులు తీవ్ర అనారోగ్యాల పాలవతున్నారని తెలంగాణ హై కోర్టులో ఎమ్. ఆదిత్య అనే వ్యక్తి అప్పీల్ దాఖలు చేశారు. పిటిషనర్ తరపు న్యాయవాది రాపోలు భాస్కర్ కోర్టులో ఈ అంశంపైన సోమవారం వాదించారు. ఈ వాదనలను విన్న హైకోర్టు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (పీసీబీ), మున్సిపల్ కమిషన్, తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డితో సహా రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌లకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 19కి వాయిదా వేసింది. అదే విధంగా  ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.



Tags:    

Similar News