పిల్లిని చూసి పులి అనుకున్న ఎయిర్ పోర్ట్ సిబ్బంది

Update: 2019-11-27 16:34 GMT

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో పనిచేస్తున్న సిబ్బందిని అడవి పిల్లి పరుగులు పెట్టించింది. దూరం నుంచి పిల్లిని చూసిన కొంతమంది సిబ్బంది దాన్ని చిరుత పులి అనుకున్నారు. అసలు వివరాల్లోకెళితే ఏరో టవర్స సమీపంలో ఓ జంతువు తిరగడాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సిబ్బంది దూరం నుంచి గమనించారు.

దూరం నుంచి ఆ జంతువును చూసి చిరుతపులి అనుకుని కంగారు పడ్డారు. అంతేకాక ఎయిర్ పోర్ట్ ఆవరణలో చిరుత తిరుగుతుందని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే రంగంలో కి దిగిన అటవీ శాఖ సిబ్బంది మూడు గంటలపాటు శ్రమించింది. ఎయిర్ పోర్ట్ ఆవరణలో తిరుగుతున్న జంతువును పట్టుకుంది. దాన్ని పట్టుకున్న అటవీ అధికారులు అది చిరుత కాదని అడవి పిల్లని తేల్చారు. దీంతో ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది ఊపిరి తీసుకున్నారు.



Tags:    

Similar News