ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జలకళ

Update: 2019-07-30 02:28 GMT

వాగులు.. పొంగి ప్రవహిస్తున్నాయి. నీళ్లులేక వెలవెల బోయిన ప్రాజెక్టుల్లో జలకళ సంతరించకుంది. బండరాళ్లతో దర్శనమిచ్చే జలపాతాలు నీళ్లతో పరవళ్లు తొక్కుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో జలకళ సంతరించుకున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు.. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి.. వాగులు పొంగిపొర్లుతుండటంతో పలుచోట్ల రోడ్లు తెగిపోవడం తో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షానికి పంటపొలాల్లోకి నీరే చేరి చెరువులను తలపిస్తున్నాయి. ఇచ్చోడ మండలం ముక్రా గ్రామంలో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో గ్రామంలోకి రాకపోకలు నిలిచిపోయాయి.

కుమ్రంబీమ్ జిల్లా చింతమానే పల్లి మండలం రవీందర్ నగర్, అంకోడ మధ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బెజ్జూర్ మండలంలోని కృష్ణపల్లి వాగు ఉప్పొంగి ప్రవహించడంతో దాని పరిసర ప్రాంతాల్లోని ఎనిమిది గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి వరద ముప్పు ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

వర్షాలతో జిల్లాలోని ప్రాజెక్టుల్లో వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది.. కడెం ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుతం 681 అడుగులకు నీరు చేరింది. మొన్నటివరకూ మైదానాన్ని తలపించిన ప్రాజెక్టు.. ఇప్పుడు జలకళ సంతరించుకోవడంతో రైలులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎల్లంపల్లిలో భారీగా వర్షపునీరు వచ్చి చేరుతోంది. ఓపెన్ కాస్టులోకి నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కుంటాల, పోచ్చేర జలపాతాలు నీళ్లతో పరవళ్లు తొక్కుతున్నాయి. ఈ అందాలను చూడటానికి పర్యాటకులు క్యూ కడుతున్నారు. వర్షాలు ఒక్కసారిగా ఊపందుకోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ పంటలకు ప్రాణం పోసినట్లు పడ్డ వర్షాలు పడటంతో ప్రస్తుతం అన్నదాతలు పొలం పనుల్లో బిజీ బిజీగా నిమగ్నమయ్యారు.

Tags:    

Similar News