సెక్రటేరియట్‌ శాఖల తరలింపు ప్రక్రియ వేగవంతం

Update: 2019-07-28 08:41 GMT

సచివాలయంలో శాఖల తరలింపునకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ తాత్కాలిక సెక్రటేరియట్‌గా బి.ఆర్కే భవన్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారు. బి.ఆర్కే భవనం అవసరమైన రిపేర్లు వేగవంతం చేసిన అధికారులు.. ఆగస్టు మొదటి వారంలో మొత్తం శాఖల తరలింపును పూర్తి చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. సచివాలయం తరలింపునకు ఆదేశాలు జారీ చేసిన జీఏడీ 32 శాఖలను తరలిస్తూ రహస్య ఉత్వర్వులిచ్చింది సాధారణ పరిపాలన శాఖ.

తెలంగాణ సచివాలయాన్ని కొత్తగా నిర్మించాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని కూల్చివేసి అదే చోట కొత్తది నిర్మించనున్నారు. నిర్మాణం పూర్తయ్యే వరకూ తాత్కాలిక సచివాలయంలోని శాఖలను తరలించనుంచి ప్రభుత్వం. దీనిలో భాగంగా సచివాలయంలోని చాలా శాఖలను బి.ఆర్కే భవన్‌కు తరలించనుంది. సీఎంవోను బేగంపేట్‌లోని మెట్రో భవన్‌కు తరలించనున్నట్టు తెలుస్తోంది.

గత వారమే సచివాలయ శాఖల తరలింపు ప్రారంభం కావాల్సి ఉండగా.. బి.ఆర్కే భవన్‌లో శాఖలు పూర్తవని కారణంగా కొంత ఆలస్యం అయ్యింది. అయితే, ప్రస్తుతం బి.ఆర్కే భవన్‌ ఉన్న సాంకేతిక విద్య, టెక్స్‌టైల్స్, విజిలెన్స్, మార్కెటింగ్, మైనింగ్‌లతోపాటు పలు శాఖలను వివిధ ప్రాంతాల్లో గుర్తించిన భవనాల్లోకి తరలింపును పూర్తి చేశారు అధికారులు. ఆయా శాఖలకు చెందిన ఫైల్స్‌ తరలింపు పూర్తికావడంతో అక్కడ ఉన్న మౌలిక వసతులపై దృష్టిపెట్టింది జీఏడి. ప్రభుత్వం విడుదల చేసిన 90 లక్షలతో ఆరు లిఫ్ట్‌లకు సంబంధించిన రిపేర్ పనులను దాదాపుగా పూర్తి చేశారు. భవనానికి అనేక చోట్ల రిపేరింగ్ పనులు చేయాల్సి ఉంది. ఇవన్నీ పూర్తి చేసేందుకు వేగం పెంచారు అధికారులు.

సెక్రటేరియట్‌లోని ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌ను ఇప్పటికే బి.ఆర్కే భవన్‌కు తరలించిన అధికారులు.. దీనికి సంబంధించి టెక్నికల్‌గా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తం శాఖల తరలింపు పూర్తి కాగానే బి.ఆర్కే భవన్‌ నుంచి నెట్‌వర్క్‌ను యాక్టివ్ చేయనున్నారు అధికారులు. మరోవైపు శాఖల తరలింపులో సీఎం కేసీఆర్ చెప్పిన ముహూర్తం ప్రకారం ప్రారంభిస్తారని తెలుస్తోంది. వచ్చే నెల ఒకటిన అమావాస్య ఉండటంతో అప్పటి వరకూ ఆగి వచ్చే నెల 3 నుంచి శాఖల తరలింపును ప్రారంభించేందుకు జీఏడీ అన్ని ఏర్పాట్లను చేసుకుంటోంది. మొత్తానికి సచివాలయ శాఖల తరలింపును ఆగస్టు మొదటి వారంలో పూర్తి చేయనున్నారు అధికారులు. 

Tags:    

Similar News