రానున్న రెండు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం

తెలంగాణలో 16, 17 తేదిల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 17న ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

Update: 2019-10-15 04:28 GMT

తెలంగాణలో 16, 17 తేదిల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 17న ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో 16, 17 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

తూర్పు భారతదేశం నుంచి వీస్తున్న తేమ గాలుల వల్ల తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. కాగా, ఉత్తర భారతదేశం నుంచి నిర్మల్, రామగుండం వరకు నైరుతి రుతుపవనాలు నిష్క్రమించాయని, మరో రెండు రోజుల్లో ఇవి పూర్తిగా వెనక్కి వెళతాయని అధికారులు వివరించారు. వీటితో సంబంధం లేకుండానే ఈశాన్య రుతుపవనాలు వస్తున్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

Tags:    

Similar News