Xiaomi Mix 5: షియోమీ మిక్స్ 5 ఎంట్రీ.. ఐఫోన్ 18 సిరీస్‌కు చుక్కలే భయ్యా..!
ఎలక్ట్రానిక్స్ రంగంలో తనదైన శైలిలో దూసుకెళ్తున్న ప్రముఖ చైనా కంపెనీ షియోమీ.. మళ్లీ డిజైన్ ఆధారిత ఫ్లాగ్‌షిప్ సిరీస్ Mix లైనప్‌ను రంగంలోకి దించడానికి సిద్ధమైంది.
Xiaomi Mix 5: షియోమీ మిక్స్ 5 ఎంట్రీ.. ఐఫోన్ 18 సిరీస్‌కు చుక్కలే భయ్యా..!
Xiaomi Mix 5: ఎలక్ట్రానిక్స్ రంగంలో తనదైన శైలిలో దూసుకెళ్తున్న ప్రముఖ చైనా కంపెనీ షియోమీ.. మళ్లీ డిజైన్ ఆధారిత ఫ్లాగ్‌షిప్ సిరీస్ Mix లైనప్‌ను రంగంలోకి దించడానికి సిద్ధమైంది. కంపెనీ Xiaomi Mix 5 పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో మార్కెట్లో విడుదల చేయనున్నట్లు లీక్స్ సూచిస్తున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ iPhone 18 సిరీస్ కంటే ముందే మార్కెట్లో సందడి చేయనున్నట్లు టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఫుల్‌స్క్రీన్ డిప్‌ప్లే:
ఈ Mix సిరీస్‌ను షియోమీ ఎప్పుడూ అత్యాధునిక టెక్నాలజీ షోకేస్‌గా ఉపయోగించింది. అదే వ్యూహాన్ని Mix 5తో మరోసారి అమలు చేయాలని కంపెనీ భావిస్తున్నట్లు లీక్‌లు సూచిస్తున్నాయి. ముఖ్యంగా ముందువైపు డిస్‌ప్లే ఫుల్‌స్క్రీన్ డిజైనింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు టెక్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
తాజాగా ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్‌లో చేసిన పోస్ట్ ప్రకారం.. ఓ ప్రముఖ బ్రాండ్ క్వాడ్ కర్వ్ డిస్‌ప్లేతో పాటు అండర్ డిస్‌ప్లే సెల్ఫీ కెమెరా కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను అభివృద్ధి చేస్తోంది. మరో నివేదిక సమాచారం ప్రకారం.. Xiaomi Mix 5లో అండర్ డిస్‌ప్లే 3D ఫేస్ రికగ్నిషన్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. ఇది నిజమైతే ఈ టెక్నాలజీని కమర్షియల్ స్మార్ట్‌ఫోన్‌లో తీసుకువచ్చిన మొదటి కంపెనీగా షియోమీ చరిత్ర సృష్టించే అవకాశం ఉంది.
ఇకపోతే.. షియోమీ చివరిసారిగా ఆగస్టు 2021లో షియోమీ Mix 4ను విడుదల చేసింది. ఆ ఫోన్‌లో కంపెనీ తొలి అండర్ డిస్‌ప్లే ఫ్రంట్ కెమెరా, సిరామిక్ యూనిబాడీ డిజైన్, స్నాప్ డ్రాగన్ 888+ ప్రాసెసర్, 6.67 ఇంచుల అమోల్డ్ డిస్‌ప్లే, 20MP హిడెన్ సెల్ఫీ కెమెరాను అందించింది. అయితే అప్పటి అండర్ డిస్‌ప్లే టెక్నాలజీ పరిమితుల కారణంగా సెల్ఫీ కెమెరా అనుభవం అంతగా ఆకట్టుకోలేకపోయింది.
షియోమీ ఇప్పుడు నాలుగేళ్ల విరామం తర్వాత తీసుకొస్తున్న Mix 5.. అండర్ డిస్‌ప్లే టెక్నాలజీలో భారీ మెరుగుదలతో పాటు.. షియోమీ ఇన్నోవేషన్ శక్తిని మరోసారి ప్రపంచానికి చూపించనుందని అంచనాలు ఉన్నాయి. అయితే కంపెనీ నుంచి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉన్నా.. లీక్‌లు మాత్రం షియోమీ Mix సిరీస్ గ్రాండ్ కంబ్యాక్‌కు భారీ సంకేతాలు ఇస్తున్నాయి.