Xiaomi 17 Ultra: 200MP పెరిస్కోప్ కెమెరా.. షావోమీ పవర్‌ఫుల్ ఫోన్ లాంచ్..!

Xiaomi 17 Ultra: షావోమీ తన అత్యంత శక్తివంతమైన అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా లాంచ్ చేసింది.

Update: 2025-12-26 15:00 GMT

Xiaomi 17 Ultra: షావోమీ తన అత్యంత శక్తివంతమైన అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ కొత్త డివైస్ షావోమీ 17 సిరీస్‌ లో భాగం. కెమెరా, పర్ఫామెన్స్, బ్యాటరీ లైఫ్‌లో భారీ అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. షావోమీ 17 అల్ట్రా ఒక హై ఎండ్ ఫోన్. షావోమీ కంపెనీ దీన్ని షావోమీ 15 అల్ట్రా కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా పేర్కొంది. ఇతర బ్రాండ్స్ ప్రీమియం ఫ్లాగ్‌షిప్స్‌తో డైరెక్ట్ ఈ ఫోన్ పోటీ పడుతుంది.

షావోమీ 17 అల్ట్రాలో అడ్వాన్స్‌డ్ కెమెరా సిస్టమ్ ఉంది. భారీ 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉంది. లాంగ్ రేంజ్ జూమ్‌తో ఇమేజ్ క్లారిటీ మెరుగుపరుస్తుంది. ప్రైమరీ కెమెరా 50MP వన్ ఇంచ్ సెన్సార్ ఉపయోగిస్తుంది. లో లైట్ ఫోటోగ్రఫీ, డీటెయిల్ క్యాప్చర్ మెరుగుపడుతుంది. మూడో రియర్ కెమెరా 50MP అల్ట్రావైడ్ లెన్స్. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఫోన్‌లో పెద్ద 6.9 అంగుళాల ఎల్‌టీపీఓ AMOLED డిస్‌ప్లే ఉంది. 1.5K రిజల్యూషన్ షార్ప్ విజువల్స్ ఇస్తుంది. స్మూత్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. పీక్ బ్రైట్‌నెస్ 1060 నిట్స్ వరకు వస్తుంది. షీల్డ్ గ్లాస్ 3తో స్క్రీన్ ప్రొటెక్ట్ చేశారు. స్క్రాచెస్, యాక్సిడెంటల్ డ్రాప్స్ నుంచి డ్యూరబిలిటీ మెరుగుపడుతుంది.

షావోమీ 17 అల్ట్రాలో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ ఉంది. గేమింగ్, మల్టీటాస్కింగ్‌కు టాప్ లెవల్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. గరిష్టంగా 16GB ర్యామ్ ఉంది. స్టోరేజ్ ఆప్షన్స్ 1TB వరకు ఉన్నాయి. హెవీ యూజర్లు, కంటెంట్ క్రియేటర్లకు సరిపడుతుంది.

లేటెస్ట్ సాఫ్ట్‌వేర్, నెట్‌వర్క్ సపోర్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 16పై రన్ అవుతుంది. షావోమీ లేటెస్ట్ హైపర్‌ఓఎస్ 3 ఇంటర్‌ఫేస్ ఉంది. 51కు పైగా 4G, 5G బ్యాండ్స్ సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ 5G సిమ్ కార్డ్ సపోర్ట్ ఉంది. అన్ని ప్రాంతాల్లో వైడ్ నెట్‌వర్క్ కంపాటిబిలిటీ ఇస్తుంది.

భారీ బ్యాటరీతో ఫాస్ట్ చార్జింగ్

షావోమీలో 6,800 mAh పెద్ద బ్యాటరీ ఉంది. 90W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 50W వైర్‌లెస్ చార్జింగ్ కూడా ఉంది. డైలీ యూసేజ్‌కు త్వరిత పవర్ అప్ ఇస్తుంది. హెవీ యూసేజ్‌లో ఫుల్ డే రన్ అవుతుంది. ఈ ఫోన్ IP68 రేటింగ్‌తో వాటర్, డస్ట్ రెసిస్టెంట్. మోడర్న్ కనెక్టివిటీ ఆప్షన్స్ వైఫై 7 ఉంది. బ్లూటూత్ 5.4 స్టేబుల్ వైర్‌లెస్ కనెక్షన్స్ ఇస్తుంది. ఎన్‌ఎఫ్‌సీ సపోర్ట్ కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్, క్విక్ పెయిరింగ్ ఇస్తుంది.

షావోమీ 17 అల్ట్రా మూడు స్టోరేజ్ వేరియంట్స్ ఆఫర్ చేస్తోంది. బేస్ వేరియంట్ 12GB ర్యామ్ + 512GB స్టోరేజ్. చైనాలో దీని ప్రారంభ ధర CNY 6,999. ఇది సుమారు భారత కరెన్సీ రూ.89,500కు సమానం. సెకండ్ వేరియంట్ CNY 7,499. టాప్ ఎండ్ వేరియంట్ CNY 8,499. ఈ ధరలు ఐఫోన్ 17 కంటే ఎక్కువ. చైనాలో డిసెంబర్ 27 నుంచి సేల్ ప్రారంభం. గ్లోబల్ లాంచ్ వచ్చే ఏడాది ప్రారంభంలోనే జరగవచ్చు.

Tags:    

Similar News