Xiaomi 17 Series: భారత మార్కెట్‌ను షేక్ చేయనున్న షియోమి.. స్పెక్స్ చూస్తే వావ్ అనాల్సిందే..!

Xiaomi 17 Series: త్వరలోనే భారత మార్కెట్లోకి షియోమి తన తదుపరి తరం ఫ్లాగ్‌షిప్ Xiaomi 17 Ultra, Xiaomi 17 స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసేందుకు తాజాగా ‘బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్’ సర్టిఫికేషన్ పొందింది.

Update: 2026-01-02 13:28 GMT

Xiaomi 17 Series: భారత మార్కెట్‌ను షేక్ చేయనున్న షియోమి.. స్పెక్స్ చూస్తే వావ్ అనాల్సిందే..!

Xiaomi 17 Series: త్వరలోనే భారత మార్కెట్లోకి షియోమి తన తదుపరి తరం ఫ్లాగ్‌షిప్ Xiaomi 17 Ultra, Xiaomi 17 స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసేందుకు తాజాగా ‘బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్’ సర్టిఫికేషన్ పొందింది. దీంతో మరికొన్ని రోజుల్లో ఇండియన్ మార్కెట్‌లో ఈ ఫోన్లు విడుదల కావడం ఖాయమని తెలుస్తోంది. అయితే ఈ సిరీస్ ఎప్పుడు లాంచ్ అవుతుందనే కచ్చితమైన సమాచారంపై స్పష్టత లేదు. ఇటీవల కొన్ని లీక్స్ సూచించిన వివరాల ప్రకారం.. ఈ షియోమి 17 సిరీస్‌కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.

Xiaomi 17 Ultra, Xiaomi 17 స్మార్ట్‌ఫోన్‌లు 2026 మార్చిలో భారత మార్కెట్‌లోకి రానున్నట్లు టెక్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అలాగే అల్ట్రా, స్టాండర్డ్ మోడల్స్‌ను లాంచ్ చేసిన తర్వాత Xiaomi 17T ఏప్రిల్ 2026 నాటికి భారత మార్కెట్లోకి ప్రవేశించవచ్చని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. షియోమి తన ఫ్లాగ్‌షిప్, అప్పర్-ప్రీమియం సెగ్మెంట్‌ను దశలవారీగా విడుదల చేయడానికి అనుసరిస్తున్న కొత్త వ్యూహం ఇదే.

షియోమి గ్రూప్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ Xu Fei.. Xiaomi 17 Ultra 2026 జనవరిలో ఎంపిక చేసిన ప్రపంచ మార్కెట్లలో విడుదల అవుతుందని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో షియోమి 17 సిరీస్ భారత్‌లోకి రావడానికి దాదాపు రెండు నెలల సమయం పట్టొచ్చు. ఈ సిరీస్ ఇప్పటికే BIS ఆమోదం పొందినందున.. మన మార్కెట్‌లో ఖచ్చితంగా విడుదల కానుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.

షియోమి 17 అల్ట్రా ఫోన్ ఇప్పటికే చైనాలో విడుదలైంది. ఇది తాజా టెక్నాలజీ ఉన్న ఫ్లాగ్‌షిప్, ప్రీమియం వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని రూపొందించబడింది. చైనాలో దీని ప్రారంభ ధర దాదాపు రూ.90వేలు అయితే.. టాప్ వేరియంట్ ధర రూ.1.09 లక్షల వరకు ఉంది. ఇది 6.9-అంగుళాల 1.5K LTPO అమోలెడ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, పీక్ బ్రైట్‌నెస్‌‌ను కలిగి ఉంది.

ఇకపోతే.. Xiaomi 17 స్టాండర్డ్ మోడల్ మరింత కాంపాక్ట్, బ్యాలెన్స్‌డ్ ఫ్లాగ్‌షిప్ అనుభవాన్ని అందించనుందని సమాచారం. ఇది 6.3-అంగుళాల 1.5K OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. చిన్న సైజులో ప్రీమియం ఫీచర్లను కోరుకునే వినియోగదారులకు ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్. ఇక పనితీరు పరంగా.. Xiaomi 17 Ultra, Xiaomi 17 ఫోన్‌లు రెండూ క్వాల్‌కమ్ కొత్త స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందే అవకాశం ఉంది. షియోమి 2026లో భారత మార్కెట్‌లో తన ఫ్లాగ్‌షిప్ వ్యూహాన్ని మరింత బలోపేతం చేయడానికి సిద్ధమైంది.

Tags:    

Similar News