WhatsApp New Rule 2026: వాట్సాప్ యూజర్లకు షాక్.. నేటి నుంచే కొత్త రూల్.. ఫోన్‌లో 'యాక్టివ్ సిమ్' లేకపోతే యాప్ బంద్!

WhatsApp New Rule 2026: మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.

Update: 2026-03-01 08:30 GMT

WhatsApp New Rule 2026: వాట్సాప్ యూజర్లకు షాక్.. నేటి నుంచే కొత్త రూల్.. ఫోన్‌లో 'యాక్టివ్ సిమ్' లేకపోతే యాప్ బంద్!

WhatsApp New Rule 2026: మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. టెలికమ్యూనికేషన్ల భద్రతను పటిష్టం చేసే లక్ష్యంతో, నేటి నుంచి (మార్చి 1, 2026) వాట్సాప్ వాడకంలో భారీ మార్పులు అమల్లోకి రానున్నాయి. ఇకపై మొబైల్‌లో యాక్టివ్ సిమ్ కార్డ్ లేకుండా వాట్సాప్ సేవలను పొందడం సాధ్యం కాదని టెలికమ్యూనికేషన్ల విభాగం (DoT) స్పష్టం చేసింది. కొత్త నిబంధనల ప్రకారం.. మీ వాట్సాప్ ఏ నంబర్‌తో అయితే రిజిస్టర్ అయ్యిందో, అదే సిమ్ కార్డ్ మీ ఫోన్‌లో కచ్చితంగా ఉండాలి. దీనినే 'సిమ్-బైండింగ్' అని పిలుస్తారు.

మీరు వాట్సాప్ వాడుతున్న ఫోన్‌లో ఆ సిమ్ యాక్టివ్‌గా లేకపోయినా లేదా తీసివేసినా.. వెంటనే మీ ఖాతా సేవలు నిలిచిపోయే అవకాశం ఉంది. దీని లక్ష్యం ఏమిటంటే.. నకిలీ ఖాతాలను ఏరివేయడం, ఒకరి నంబర్‌తో మరొకరు వాట్సాప్ వాడకుండా నిరోధించడం అని డీఓటీ స్పష్టం చేసింది. చాలామంది తమ ఫోన్‌లో సిమ్ లేకపోయినా వైఫై (Wi-Fi) ద్వారా టాబ్లెట్లు లేదా సెకండరీ ఫోన్లలో వాట్సాప్ వాడుతుంటారు. ఇకపై అది కుదరదు. వాట్సాప్ వెబ్ లేదా డెస్క్‌టాప్ వెర్షన్ వాడుతున్న వారు కూడా తమ సిమ్ యాక్టివ్‌గా ఉందో లేదో ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. మొబైల్‌లో సిమ్ యాక్టివ్‌గా లేదని గుర్తిస్తే, ఇతర పరికరాల్లో ఉన్న వాట్సాప్ ఖాతా కూడా ఆటోమేటిక్‌గా లాగ్ అవుట్ అవుతుంది.

ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందంటే..

సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలను అరికట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అలాగే దీంతో వర్చువల్ నంబర్లు లేదా పాత నంబర్లతో నడిచే ఫేక్ అకౌంట్లకు చెక్ పడుతుందని చెప్పారు. యూజర్ల డిజిటల్ గుర్తింపును రక్షించడానికి, సైబర్ నేరగాళ్లు ఇతరుల ఖాతాలను యాక్సెస్ చేయకుండా చూడటానికి 'సిమ్ వెరిఫికేషన్' తప్పనిసరి చేశారు. మీరు కూడా మీ పాత నంబర్‌తో లేదా ప్రస్తుతం ఫోన్‌లో లేని నంబర్‌తో వాట్సాప్ వాడుతుంటే, వెంటనే మీ యాక్టివ్ నంబర్‌కు ఖాతాను మార్చుకోవడం ఉత్తమం. లేదంటే మీ ముఖ్యమైన చాట్స్, డేటా యాక్సెస్ కోల్పోయే ప్రమాదం ఉంది.

Tags:    

Similar News