WhatsApp new features: ఒకే ఫోన్‌లో అనేక వాట్సాప్ అకౌంట్లు.. అద్భుతమైన కొత్త ఫీచర్ త్వరలో!

WhatsApp new features: వాట్సాప్ వినియోగదారులకు త్వరలోనే మరొక సంతోషకరమైన అప్‌డేట్ రానుంది. ఇప్పుడు ఒక్క ఫోన్‌లోనే రెండు లేదా అంతకంటే ఎక్కువ వాట్సాప్ అకౌంట్లను యాక్సెస్ చేయగలిగే విధంగా ఈ మెస్ేజింగ్ యాప్ కొత్త ఫీచర్‌పై పనిచేస్తోంది.

Update: 2025-06-30 16:30 GMT

WhatsApp new features: ఒకే ఫోన్‌లో అనేక వాట్సాప్ అకౌంట్లు.. అద్భుతమైన కొత్త ఫీచర్ త్వరలో!

WhatsApp new features: వాట్సాప్ వినియోగదారులకు త్వరలోనే మరొక సంతోషకరమైన అప్‌డేట్ రానుంది. ఇప్పుడు ఒక్క ఫోన్‌లోనే రెండు లేదా అంతకంటే ఎక్కువ వాట్సాప్ అకౌంట్లను యాక్సెస్ చేయగలిగే విధంగా ఈ మెస్ేజింగ్ యాప్ కొత్త ఫీచర్‌పై పనిచేస్తోంది.

డబ్ల్యూఏబీటాఇన్ఫో (WABetaInfo) తాజా నివేదిక ప్రకారం, ఐఓఎస్ బీటా వెర్షన్ 25.19.10.74లో ఈ ఫీచర్‌ను టెస్ట్ ఫ్లైట్ యాప్ ద్వారా పరీక్షిస్తున్నారు. ఆ స్క్రీన్‌షాట్‌ను సంస్థ షేర్ చేయగా, అందులో కొత్త ఫీచర్ ఎలా పనిచేస్తుందో స్పష్టంగా కనిపిస్తోంది.

ఖాతాల మధ్య తేలికగా మారవచ్చు

సెట్టింగ్స్‌లో ఓ ప్రత్యేక విభాగం ద్వారా యూజర్లు తమ ఫోన్‌లో నమోదైన అన్ని వాట్సాప్ ఖాతాలను ఒకే చోట చూడగలుగుతారు. ప్రతి ఖాతాకు సంబంధించిన ప్రొఫైల్ ఫోటో, పేరు చూపబడుతుంది. దీని వలన యూజర్లు ఏ ఖాతాలోకి మారాలనుకుంటున్నారో సులభంగా గుర్తించగలుగుతారు.

ప్రత్యేకంగా, కొత్త ఖాతాను యాప్‌లో యాడ్ చేసినా, ఇప్పటికే ఉన్న డేటా ఎలాంటి నష్టం లేకుండా కొనసాగుతుంది. అంటే – చాట్‌లు, సెట్టింగులు అన్నీ పాత ఖాతాలో మునుపటిలానే కొనసాగుతాయి.

లాగౌట్ అవసరం లేకుండా స్విచ్ చేయవచ్చు

వేరే ఖాతాలోకి మారాలంటే యాప్‌ను లాగౌట్ చేయాల్సిన అవసరం ఉండదు. స్క్రీన్ దిగువ భాగంలో "ఖాతా విజయవంతంగా మారింది" అనే ధృవీకరణ సందేశం కనిపిస్తుంది. ఫేస్‌బుక్‌లో అకౌంట్ స్విచ్ చేసే విధానంలోనే ఇది కూడా పనిచేస్తుంది.

ప్రత్యేక నోటిఫికేషన్లతో మరింత సౌలభ్యం

ఈ కొత్త ఫీచర్ ద్వారా, ప్రైమరీ అకౌంట్‌ను ఉపయోగిస్తున్నప్పుడు కూడా సెకండరీ ఖాతాలో వచ్చిన మెసేజ్‌కి ప్రత్యేక నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్‌లో సందేశం వచ్చిన వ్యక్తి పేరు, అలాగే మెసేజ్ ఏ ఖాతాకు వచ్చిందన్న విషయాలు స్పష్టంగా చూపబడతాయి. ఆ నోటిఫికేషన్‌పై ట్యాప్ చేస్తే, యాప్ స్వయంచాలకంగా ఆ ఖాతాలోకి మారుతుంది.


ఒకే డివైజ్‌లో అనేక వాట్సాప్ అకౌంట్లను నిర్వహించాలనుకునే వారికి ఇది గొప్ప పరిష్కారం. త్వరలోనే బీటా పరీక్షలు పూర్తి అయిన తర్వాత ఈ ఫీచర్‌ను అందరికీ విడుదల చేసే అవకాశముంది.

Tags:    

Similar News