Vivo Y500i: వివో వై500ఐ.. మిడ్ రేంజ్‌లో వస్తోంది.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!

Vivo Y500i: మిడ్ రేంజ్ ఫోన్ మార్కెట్ లో పెద్ద బ్యాటరీ ప్రధాన అవసరంగా మారిన ఈ సమయంలో వివో మరో కొత్త ఫోన్‌తో ముందుకు వచ్చింది.

Update: 2025-12-27 14:00 GMT

Vivo Y500i: మిడ్ రేంజ్ ఫోన్ మార్కెట్ లో పెద్ద బ్యాటరీ ప్రధాన అవసరంగా మారిన ఈ సమయంలో వివో మరో కొత్త ఫోన్‌తో ముందుకు వచ్చింది. ఇప్పటికే వై 500 ప్రో ద్వారా భారీ బ్యాటరీ ఫోన్ ఇచ్చిన వివో, ఇప్పుడు అదే సిరీస్ లో వివో వై 500ఐ ను తీసుకురావడానికి సిద్ధమైంది. అధికారిక లాంచ్ కి ముందే చైనా టెలికాం డేటాబేస్ లో ఈ ఫోన్ వివరాలు కనిపించడంతో స్పెసిఫికేషన్స్ అన్నీ దాదాపుగా బయటకు వచ్చాయి. ముఖ్యంగా 7200mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 16, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ లాంటి అంశాలు ఈ ఫోన్‌ను డైలీ యూజ్ కోసం బలమైన ఎంపికగా చూపిస్తున్నాయి.

వివో వై 500ఐ డిజైన్ మొదట చూసిన వెంటనే ఒక ప్రీమియం ఫీల్ ఇస్తుంది. ఈ ఫోన్ డిజైన్ చాలా వరకు వివో ఎస్50 ను గుర్తు చేస్తుంది. బ్యాక్ ప్యానల్ మీద క్లిన్ ఫినిష్ ఉండటం వల్ల ఫింగర్ ప్రింట్స్ ఎక్కువగా పడే అవకాశం తక్కువగా ఉంటుంది. కెమెరా మాడ్యూల్ ఎక్కువగా బయటకు రావకుండా ఫ్లాట్ డిజైన్ లో ఉండటం వల్ల ఫోన్ టేబుల్ మీద పెట్టినప్పుడు స్టేబుల్ గా ఉంటుంది. ఈ ఫోన్ సైజ్ 166.64mm పొడవు, 78.43mm వెడల్పు, 8.39mm మందంతో ఉంది. బరువు 219గ్రాములు కావడంతో పెద్ద బ్యాటరీ ఉన్నా కూడా రోజువారీ వాడకంలో ఎక్కువగా ఇబ్బంది అనిపించదు. సైడ్ లో ఉన్న ఫింగర్ ప్రింట్ సెన్సార్ స్పందన కూడా ఫాస్ట్ గా ఉంటుందని అంచనా.

వివో వై 500ఐ లో 6.75అంగుళాల పెద్ద డిస్‌ప్లే ఇవ్వడం జరిగింది. రిజల్యూషన్ 1570×720పిక్సెల్స్ హెచ్ డీ ప్లస్ కావడంతో వీడియోలు చూడటం, న్యూస్ చదవటం, సోషల్ మీడియా బ్రౌజింగ్ లాంటి పనులకు ఇది సరిపోతుంది. ఫుల్ హెచ్ డీ డిస్ప్లే కాకపోయినా పెద్ద స్క్రీన్ కారణంగా కంటెంట్ చూడటంలో ఇమర్షన్ ఫీల్ వస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రిజల్యూషన్ బ్యాటరీపై ఎక్కువ ఒత్తిడి పెట్టదు. అందువల్ల లాంగ్ బ్యాటరీ బ్యాక్ అప్ రావడానికి ఇది సహాయపడుతుంది.

వివో వై 500ఐలో వెనుకవైపు ఒకే ఒక్క 50మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇది డే లైట్ లో షార్ప్ ఫోటోలు తీయగల సామర్థ్యం కలిగి ఉంటుంది. డాక్యుమెంట్ స్కాన్ చేయడం, సాధారణ ఫోటోగ్రఫీ అవసరాలకు ఇది సరిపోతుంది. మల్టీ కెమెరా సెటప్ లేకపోయినా ఈ ఫోన్ కెమెరా ఫోకస్ పూర్తిగా క్లారిటీ మీదే ఉంది.ముందు భాగంలో 5మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. వీడియో కాల్స్, సాధారణ సెల్ఫీలు తీసుకునే వారికి ఇది సరిపోతుంది. ఇది కెమెరా ఫోన్ కాకపోయినా అవసరమైనంత అవుట్‌పుట్ ఇవ్వగలదు.

ఈ పోన్‌లో ఉన్న పెద్ద హైలైట్ ఆండ్రాయిడ్ వెర్షన్. వివో వై 500ఐ బాక్స్ నుంచి బయటకు వచ్చినప్పుడే ఆండ్రాయిడ్ 16 తో వస్తుంది. సాధారణంగా ఈ ధర రేంజ్ లో ఆండ్రాయిడ్ పాత వెర్షన్ కనిపిస్తుంది. కానీ ఇక్కడ లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఇవ్వడం వల్ల ఫ్యూచర్ అప్డేట్స్, సెక్యూరిటీ ప్యాచ్ లు ఎక్కువ కాలం వచ్చే అవకాశం ఉంటుంది. కొత్త ఫీచర్లు, స్మూత్ యూజర్ అనుభవం కోరుకునే వారికి ఇది పెద్ద ప్లస్ పాయింట్.

ఈ ఫోన్‌లో ఉపయోగించిన ప్రాసెసర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2. ఇది డైలీ యూజ్ కోసం రూపొందించిన చిప్‌సెట్. సోషల్ మీడియా యాప్స్, వీడియో స్ట్రీమింగ్, లైట్ గేమ్స్ లాంటి వాటిలో ఎలాంటి ల్యాగ్ లేకుండా నడుస్తుంది. హెవీ గేమింగ్ కోసం ఇది కాకపోయినా సాధారణ వినియోగానికి ఇది స్టేబుల్ పర్‌ఫార్మెన్స్ ఇస్తుంది. మెమరీ ఆప్షన్లలో 8జిబి ర్యామ్ ప్లస్ 256జిబి స్టోరేజ్, 8జిబి ప్లస్ 512జిబి, 12జిబి ప్లస్ 256జిబి వేరియంట్లు ఉండటం వల్ల యూజర్ అవసరాన్ని బట్టి ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది.

వివో వై 500ఐ లో ఉన్న అతి పెద్ద ప్లస్ పాయింట్ 7200mAh భారీ బ్యాటరీ. ఈ బ్యాటరీ ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే నార్మల్ యూజ్ లో 2 రోజులు సులభంగా నడిచే అవకాశం ఉంది. ఎక్కువగా కాల్స్, వీడియోలు, సోషల్ మీడియా వాడే వాళ్లకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ స్పీడ్ వివరాలు ఇంకా బయటకు రాలేదు కానీ బ్యాటరీ కెపాసిటీ మాత్రం లాంగ్ యూజ్ కి పూర్తి నమ్మకం ఇస్తుంది.

ఈ ఫోన్‌లో వైఫై, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ లాంటి అవసరమైన కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. యూఎస్బీ టైప్ సీ పోర్ట్ ఇవ్వడం వల్ల ఛార్జింగ్ సౌకర్యంగా ఉంటుంది. డైలీ యూజ్ కి అవసరమైన అన్ని ఫీచర్లు ఈ ఫోన్‌లో అందుబాటులో ఉన్నాయి. వివో వై 500ఐ ఫోన్ అబ్సిడియన్ బ్లాక్, గెలాక్సీ సిల్వర్, నియర్ గోల్డ్ బ్రౌన్, విండ్ ఫెదర్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో రానుంది. సింపుల్ కలర్ కావాలనుకునే వాళ్లకు బ్లాక్, సిల్వర్ సరిపోతాయి. స్టైలిష్ లుక్ కోరుకునే వాళ్లకు గోల్డ్ షేడ్స్ ఆకర్షణగా ఉంటాయి.

వివో వై 500ఐ ఫోన్ ధరపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ స్పెసిఫికేషన్స్ చూస్తే ఈ ఫోన్ చైనాలో రూ.15,000 నుంచి రూ.18,000 మధ్య ధరలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేయవచ్చు. 7200mAh భారీ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 16, స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్ లాంటి ఫీచర్లు ఈ ధర రేంజ్ కి సరిపోతాయి. ఎక్కువ స్టోరేజ్ వేరియంట్ అయిన 12జిబి ర్యామ్ ప్లస్ 256జిబి మోడల్ ధర రూ.19,000 వరకు వెళ్లే ఛాన్స్ కూడా ఉంది. ఇండియా లాంచ్ జరిగితే టాక్స్, మార్కెట్ స్ట్రాటజీ ఆధారంగా ధర కొంచెం మారే అవకాశం ఉన్నా, మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో బ్యాటరీ ఫోన్‌గా ఇది కాంపిటేటివ్ ప్రైస్ తో వచ్చే అవకాశమే ఎక్కువ. డైలీ యూజ్ ఫోన్‌గా చూస్తే వివో వై 500ఐ మంచి బ్యాలెన్స్ ఉన్న ఫోన్ అని చెప్పొచ్చు.

Tags:    

Similar News