Trump T1 Smartphone: ట్రంప్ మావ ఫోన్ వచ్చేసింది.. AI ఫీచర్స్, ట్రిపుల్ కెమెరా.. ఆ కంపెనీలకు చుక్కలే..!

Trump T1 Smartphone: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యాపిల్, గూగుల్, శాంసంగ్ వంటి పెద్ద కంపెనీల టెన్షన్ పెంచబోతున్నారు. ఇటీవల, ట్రంప్ యాపిల్ సీఈఓ టిమ్ కుక్‌ను భారతదేశంలో కాకుండా అమెరికాలో యాపిల్ ఫోన్‌లను తయారు చేయాలని కోరారు.

Update: 2025-06-17 06:13 GMT

Trump T1 Smartphone: ట్రంప్ మావ ఫోన్ వచ్చేసింది.. AI ఫీచర్స్, ట్రిపుల్ కెమెరా.. ఆ కంపెనీలకు చుక్కలే..!

Trump T1 Smartphone: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యాపిల్, గూగుల్, శాంసంగ్ వంటి పెద్ద కంపెనీల టెన్షన్ పెంచబోతున్నారు. ఇటీవల, ట్రంప్ యాపిల్ సీఈఓ టిమ్ కుక్‌ను భారతదేశంలో కాకుండా అమెరికాలో యాపిల్ ఫోన్‌లను తయారు చేయాలని కోరారు. అయితే, డోనాల్డ్ ట్రంప్ ప్రకటనపై టిమ్ కుక్ ఇంకా ఎటువంటి స్పందన ఇవ్వలేదు. ఇంతలో, ట్రంప్ కంపెనీ ఇప్పుడు అమెరికాలో స్మార్ట్‌ఫోన్ వ్యాపారంలోకి ప్రవేశించబోతోంది. ఈ ప్రీమియం మొబైల్ ఫోన్ ఐఫోన్, గూగుల్ పిక్సెల్ లతో నేరుగా పోటీపడుతుంది. ట్రంప్ కంపెనీ ఈ ఫోన్‌కు ట్రంప్ మొబైల్ T1 అని పేరు పెట్టింది, దీనిని కంపెనీ త్వరలో అమ్మకానికి అందుబాటులోకి తెస్తుంది.

Trump T1 Price

ట్రంప్ T1 గురించి ప్రత్యేకత ఏమిటంటే ఈ ఫోన్ అమెరికాలో తయారు చేస్తారు. అంటే ఇది అమెరికాలో తయారవుతుంది ఈ ఫోన్‌ను డోనాల్డ్ ట్రంప్ కుటుంబ వ్యాపారం లాంచ్ చేస్తుంది. ఈ ఫోన్ గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో పనిచేస్తుంది. ఈ ఫోన్ ప్రీ-బుకింగ్ ప్రారంభమైంది. దీని ధర 499 డాలర్లు అంటే దాదాపు రూ. 42,800 గా ఉంచారు. ట్రంప్ మొబైల్ ధర యాపిల్ ఐఫోన్ ,గూగుల్ పిక్సెల్ ఫోన్ కంటే చాలా తక్కువ. వినియోగదారులు ఈ ఫోన్‌ను $100 అంటే దాదాపు రూ. 8,300 చెల్లించి EMIలో కూడా కొనుగోలు చేయవచ్చు.

Trump T1 Features

నివేదిక ప్రకారం, డోనాల్డ్ ట్రంప్ కంపెనీకి చెందిన ఈ మొబైల్ ఫోన్ 6.8-అంగుళాల అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. ఫోన్ డిస్ప్లే 120Hz హై రిఫ్రెష్ రేట్ ఫీచర్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంటుంది, ఇందులో 50MP మెయిన్, 2MP డెప్త్, 2MP మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 16MP కెమెరా ఉంటుంది.

ట్రంప్ మొబైల్ T1లో 5000mAh బ్యాటరీ ఉంటుంది. దీనితో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ అందించారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌లో పనిచేస్తుంది. దీనికి 12GB RAM +256GB వరకు స్టోరేజ్ ఉంటుంది. ఇది మాత్రమే కాదు, బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ సెక్యూరిటీ ఫీచర్లతో పాటు, AI ఆధారిత ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఫోన్‌లో అందుబాటులో ఉంటుంది.

ఈ ఫోన్‌తో ట్రంప్ ప్రత్యేక మొబైల్ సేవా ప్రణాళికను కూడా ప్రకటించారు. దీనిలో, వినియోగదారులు నెలకు $47.45 అంటే దాదాపు రూ.4080 ఖర్చుతో టెలి హెల్త్ , రోడ్‌సైడ్ సహాయంతో పాటు అపరిమిత కాలింగ్, మెసేజెస్,డేటాను పొందుతారు. ఇది మాత్రమే కాదు, ఈ ప్లాన్‌తో, వినియోగదారులకు 100 కంటే ఎక్కువ దేశాలలో ఉచిత అంతర్జాతీయ కాలింగ్ సౌకర్యం కూడా ఇస్తున్నారు.

Tags:    

Similar News